పెళ్లి కాకుండా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న హీరోయిన్

ఈ మధ్య కాలంలో లివింగ్ టు గెదర్ రిలేషన్ విదేశాల నుంచి ఇండియాలోకి కూడా వచ్చేసింది.చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు పెళ్ళికి ముందే తమ ప్రేమికులతో కలిసి బ్రతకడానికి ఇష్టపడుతున్నారు.

 Kalki Koechlin Confirms Pregnancy With Boyfriend Guy-TeluguStop.com

ఈ మధ్య కాలంలో మరో అడుగు ముందుకేసి బిడ్డలని కూడా కంటున్నారు.ఇండియాలో పెళ్లి కాకుండా పిల్లలని కంటే దానిని ఏదో ఘోరమైన పాపంగా చూస్తారు.

కాని సెలబ్రిటీలు ఆ సంప్రదాయానికి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేసారు.పెళ్ళికి ముందే పిల్లల్ని కనడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది.

ఈ మద్యం కాలంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా తమ ప్రేమికుడితో రిలేషన్ లో ఉంటూ పిల్లలని కంటున్నారు.ఆ మధ్య కాలంలో రామ్ చరణ్ హీరోయిన్ బ్రిటిష్ భామ అమీ జాక్సన్ తో కూడా పెళ్లి కాకుండానే తల్లి అయ్యి పండంటి బిడ్డకి జన్మనిచ్చింది.

బాలీవుడ్ దర్శకుడుని పెళ్లి చేసుకొని తరువాత బ్రేక్ అప్ చెప్పిన నటి కల్కీ కొచ్చిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.ఈ భామ బోల్డ్ కామెంట్స్ చేయడంలోనే కాదు, సినిమాలు, వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంలో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చేస్తుంది.

ఈ భామ విడాకుల తర్వాత ఇజ్రాయిల్ నటిడు హార్స్ బర్గ్ తో రిలేషన్ లో ఉంది.ఇక వీళ్ళిద్దరూ డేటింగ్ రిలేషన్ తో ఇప్పుడు కల్కీ కొచ్చిన్ గర్భవతి కూడా అయ్యింది.

తాజాగా ఈ విషయం మీద ఆమె మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానంగా త్వరలో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు కదా మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే దానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.పిల్లల్ని కంటే పెళ్లి చేసుకోవాలని ఏమైనా ఉందా.

ఇద్దరు కలిసి బ్రతకడానికి మనసులు కలిస్తే చాలు, పెళ్లి అనే బంధం అవసరం లేదు.ఇక ఈ బంధాన్ని ఇలాగే కొనసాగిస్తాం అని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube