ఏడు కొండలపై కొలుదీరిన శ్రీనివాసుడికి దర్శించుకోవాలి అంటే ఎంతటి వ్యవప్రయాసలు.! కొండంత దైవాన్ని కనులారా తిలకించి లేక దూరమయ్యే క్షోభించినవారు ఎందరో.
అలాంటి భక్తులను ఆర్తిని తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) విశాఖ సాగరతీరంలో కలియుగ దైవాన్ని కొలువు తీర్చాలని నిర్ణయించింది.ఆ మేరకు రుషికొండ ప్రాంతంలో కొండ శిఖరంపై ఆలయ నిర్మాణ పనులు చేపట్టి దాదాపు 90 శాతం పూర్తి చేసుకుంది కూడా పూర్తయితే వెంకటేశ్వరుడు భక్తులకు అనుగ్రహంచనున్నాడు.
రుషికొండ గీతం యూనివర్సిటీ, గాయత్రి కళాశాల మధ్యనున్న కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు 28 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆలయం పనులు దాదాపు సొంత 90 శాతం పూర్తి కావచ్చాయి.
ప్రస్తుతం బీచ్ రోడ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ప్రధాన రహదారి, ఆరంభంలో ఆలయ ముఖద్వారం, అర్చకుల వసతి గదులు తదుతరు పనులు జరుగుతున్నాయి.మే నెలలో ఆలయ ప్రారంభాన్ని టిటిడి దేవస్థానం గతంలో సన్నాహాలు చేయగా కరోనా నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రణాళిక మేరకు ప్రారంభోత్సవం జరగలేదు.
మిగిలిన పనులు కూడా పూర్తయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో కార్యరూపం దాలుస్తుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

పై భాగంలో శ్రీ వేంకటేశ్వరుని కొలువు తీరి గర్భగుడి తో పాటు ఇరువైపులా వివిధ దేవతామూర్తుల ఆలయాలు నిర్మించారు.పై అంతస్తు గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా ఆలయానికి ముందు నుంచి మెట్లు సౌకర్యం కల్పించారు.పెళ్లిళ్ల కోసం 100 నుంచి 150 సరిపడే కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం కోసం టిటిడి 28 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది
LATEST NEWS - TELUGU