సెట్స్ పైకి వెళ్లనున్న కలాం బయోపిక్.... కలాం గా అనిల్ కపూర్  

Kalam Biopic Going To The Sets-

గత కొంత కాలంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎక్కువగా బయోపిక్ ల మీదే నడుస్తుంది. అంతేకాకుండా ఈ బయోపిక్స్ ను కూడా ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తుండడం తో ఇప్పుడు ఈ బయోపిక్ ల హవా అక్కడ కొనసాగుతుంది. ఇప్పడు తాజాగా మాజీ ప్రెసిడెంట్,మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం బయోపిక్ కూడా త్వరలో తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

సెట్స్ పైకి వెళ్లనున్న కలాం బయోపిక్.... కలాం గా అనిల్ కపూర్-Kalam Biopic Going To The Sets

అయితే ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాం బయోపిక్‌ని తమ సంస్థలో రూపొందించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర , అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో అబ్దుల్ కలాం బయోపిక్‌ని రూపొందించనున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ చిత్రంలో కలాం పాత్రలో సీనియర్ నటుడు బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల అనిల్ కపూర్ ని కలిసి స్క్రిప్ట్ వివరించగా అది ఆయనకు ఏంతో బాగా నచ్చిందని అందుకే కలాం పాత్రకు ఆయనను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.

వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుండగా ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుంది.

83 ఏండ్ల వయస్సులో జూలై 2015న ఐఐఎం షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ కలాం కన్నుమూసిన విషయం విదితమే. ఒక పేపర్ బాయ్ గా తన జీవితాన్ని ప్రారంభించిన కలాం ఒక మిసైల్ మ్యాన్ గా ప్రెసిడెంట్ గా ఎలా ఎదిగారు అన్న విషయాలను ఈ బయోపిక్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.