కలలో ఇవి కన్పిస్తే ఏమి అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు       2018-06-27   23:58:05  IST  Raghu V

ప్రతి ఒక్కరు కలలు కనటం సహజమే. కొంతమందికి ఆలా కళ్ళు మూయగానే కలలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే కొంత మందికి గాఢ నిద్రలో మాత్రమే కలలు వస్తు ఉంటాయి. ఆ కలలు కొంతమందికి గుర్తు ఉంటాయి. కొంతమందికి అసలు గుర్తు ఉండవు. అయితే కలలో కనిపించే వాటిని బట్టి మనకు భవిష్యత్ లో జరిగే కొన్ని సంఘటనలకు సంకేతాలని చాలా మంది భావిస్తారు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కలలో చంద్రుడు కనపడితే త్వరలో ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నట్టు. అలాగే వారికీ కోపం తగ్గి ప్రశాంతంగా ఉంటారు.

జుట్టు రాలితే చాలా ఆందోళన చెందుతాం. అదే కలలో జుట్టు రాలితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే జుట్టు రాలినట్టు కల వస్తే మాత్రం త్వరలో లక్ష్మి దేవి అనుగ్రహం,కటాక్షం లభిస్తాయని అర్ధం.

కలలో సూర్యుడు కనపడితే కొంచెం ధనవంతులు అవుతారని అర్ధం. అదే సూర్యుడు ప్రకాశవంతంగా కన్పిస్తే ఎక్కువ ధనవంతులు అవుతారని అర్ధం.

కలలో డబ్బు ఉన్న పర్స్ కనిపిస్తే త్వరలో ధనవంతులు అవుతారని అర్ధం.

బియ్యం,పాలు.పంచదార లేదా బెల్లంతో తయారుచేసిన పరమాన్నం కలలో వస్తే సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది.

అందమైన అద్దం కలలో కన్పిస్తే మంచి జరుగుతుంది. అదే పగిలిన అద్దం కలలో కన్పిస్తే మాత్రం చెడు జరగటానికి సంకేతంగా చెప్పవచ్చు.