హెల్మెట్ తప్పక ధరించే విధంగా సరికొత్త రూల్ పెట్టిన కర్ణాటక పోలీసులు,కష్టమే!  

Kalaburugi Police Organises No Helmet No Petrol Campaign-kalaburugi Police Organises,no Helmet No Petrol Campaign,telugu Viral In Social Media,viral In Social Media

కొత్త మోటారు వాహన చట్టం తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఈ సారి కేంద్రం కూడా ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా భారీ గా ఫైన్ లను విధించడం తో వాహనదారులు కూడా రోడ్డు పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే ఇంట కఠిన చట్టాలు తీసుకువచ్చినా కొందరికి మాత్రం వీటిపై అవగాహన అనేది మాత్రం రావడం లేదు.

Kalaburugi Police Organises No Helmet No Petrol Campaign-kalaburugi Police Organises,no Helmet No Petrol Campaign,telugu Viral In Social Media,viral In Social Media-Kalaburugi Police Organises No Helmet Petrol Campaign-Kalaburugi No Campaign Telugu Viral In Social Media

ఈ క్రమంలో ఈ చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశ్యం తో కర్ణాటక పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరం అని, దానికి భారీ గా ఫైన్ ను విధిస్తున్న విషయం తెలిసిందే.

Kalaburugi Police Organises No Helmet No Petrol Campaign-kalaburugi Police Organises,no Helmet No Petrol Campaign,telugu Viral In Social Media,viral In Social Media-Kalaburugi Police Organises No Helmet Petrol Campaign-Kalaburugi No Campaign Telugu Viral In Social Media

అయినప్పటికీ కొందరి లో మాత్రం మార్పు రావడం లేదు.హెల్మెట్ లేకుండా పోలీసులు పట్టుకుంటే అప్పుడు ఫైన్ కట్టొచ్చు లే అనుకుంటూ ఉండేవారు కూడా లేకపోలేదు.అయితే ఇలాంటి వారి కోసం కర్ణాటక పోలీసులు హెల్మెట్ తప్పక ధరించే విధంగా సరికొత్త రూల్ ను అమలులోకి తీసుకురానున్నారు.

హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయకూడదని కలబురిగి పోలీసులు పెట్రోల్ బంకుల్లో ఆంక్షలు విధించనున్నట్లు పోలీసు కమీషనర్ ఎం ఎం నాగరాజు తెలిపారు.కలబురిగి పోలీసు కమీషనరేట్ పరిధిలో నో హెల్మెట్-నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

సెప్టెంబర్ 29 నుంచి ఈ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.మొత్తానికి ఇప్పటికే సెప్టెంబర్ 1 నుంచి అమలు అవుతున్న నూతన వాహన చట్టం తో తలలు పట్టుకుంటున్న వాహనదారులు ఇప్పుడు ఈ తాజా రూల్ తో మరోసారి ఆలోచనలో పడ్డారు.