ఏపీలో ఘోరం.. వైసీపీ నేత దారుణ హత్య.. ?

Kakinada Ycp Corporator Kapara Ramesh

ఏపీలో వైసీపీ కార్పొరేటర్ హత్య కలకలం సృష్టిస్తుంది.కాకినాడ లో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే.

 Kakinada Ycp Corporator Kapara Ramesh-TeluguStop.com

కాకినాడకు చెందిన తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అయిన కంపర రమేష్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో రెవెన్యూ కాలనీ కి చెందిన చిన్నా అనే వ్యక్తి, రమేష్ కు ఫోన్ చేసి మాట్లాడాలని ఉందని పిలిపించాడట.

చిన్నా పిలిచిన చోటుకు కార్పొరేటర్ రమేష్ వెళ్లేసరికి అక్కడ చిన్నాతో పాటుగా అతని సోదరుడు కుమార్ ఉన్నారట.

 Kakinada Ycp Corporator Kapara Ramesh-ఏపీలో ఘోరం.. వైసీపీ నేత దారుణ హత్య.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ముగ్గురు కలసి మద్యం సేవిస్తూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు గానీ హఠాత్తుగా కార్పొరేటర్ రమేష్ తన కారులో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్దుతగిలిన చిన్నా అతన్ని వెళ్లకుండా ఆపాడట.ఇలా వారిద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో విచక్షణ కోల్పోయిన చిన్నా రమేష్ ని కార్ తో ఢీ కొట్టి మరీ హత్యచేశాడట.

Telugu Andhra Pradesh, Chinna, Kakinada, Kumar, Postmortem, Ramesh, Ycp-Latest News - Telugu

అలా మొత్తం మీద మూడు సార్లు కారుతో తొక్కించి హత్యచేసిన చిన్నా ఆ తర్వాత అక్కడి నుండి పరారయ్యాడట.ఇక రక్తపు మడుగులో పడివున్న రమేష్ ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని అక్కడి వైద్యులు తెలిపారట.కాగా పోస్టుమార్టం నిమిత్తం రమేష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారట.

#Andhra Pradesh #Kumar #Postmortem #Ycp #Ramesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube