మీ ఆస్తులు ఎక్కడుంటే అక్కడ రాజధాని పెడతారా అంటున్న సీనియర్ నటి...  

kakinada shyamala doing sensational comments on AP capital issue - Telugu Kakinada Shyamala, Kakinada Shyamala Andhra Pradesh Capital Issue, Kakinada Shyamala News, Tollywood, Tollywood News

ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానులు అనే అంశం ఎంతగా కలకలం సృష్టిస్తుందో అందరికీ బాగానే తెలుసు.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలు మరియు ప్రజా సంఘాల నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Kakinada Shyamala Doing Sensational Comments On Ap Capital Issue

అయితే తాజాగా ఈ అంశంపై పై టాలీవుడ్ సీనియర్ నటి కాకినాడ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా అసలు వైజాగ్ పట్టణ పరిసర ప్రాంతంలోఅసలు ఏముందని విశాఖపట్నం పట్టణాన్ని రాజధానిగా చేయాలని చూస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు.

అంతేగాక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని అంశాన్ని కూడా ఆమె తప్పు పట్టారు.అసలు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ఎందుకని మనందరం తెలుగు వాళ్ళని కాబట్టి తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి కానీ ఇలా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఏంటని గద్దిస్తున్నారు.

అంతేగాక మీకు సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడ ఎక్కువఉంటే అక్కడ రాజధాని పెడితే సామాన్య ప్రజలు బలై పోతారని కాబట్టి ఇకనైనా రాష్ట్రానికి మూడు రాజధానులు అనే ఆలోచనను మానుకోవాలని సూచించారు.అనంతరం తన జీవితం గురించి మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారని తనకు సంబంధించిన ఆస్తులను తమ వారసులకి పంచేసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు కాకినాడ శ్యామల.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kakinada Shyamala Doing Sensational Comments On Ap Capital Issue Related Telugu News,Photos/Pics,Images..