అశ్లీల వీడియోలు ప్రభావంతో చిన్నారి పై గ్యాంగ్ రేప్...

ప్రస్తుత సమాజంలో కొన్ని ఘటనలను చూస్తే ఇలాంటి క్రూరమైన సమాజంలో మనం జీవిస్తున్నామా అన్నటువంటి సందేహం కలుగుతుంది.తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో అశ్లీల వీడియోలకు బానిసలు అయిన ఇద్దరు యువకులు ముక్కుపచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 Kakinada Ramu Siva Kites Sankranthi-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన కాకినాడ ప్రాంతంలో ఇద్దరు దంపతులు తమ చిన్నారితో కలిసి నివసిస్తున్నారు.అలాగే అదే ప్రాంతంలో  రాము, శివ (పేర్లు మార్చాం) అనే ఇద్దరు యువకులు కూడా నివసిస్తున్నారు.

అయితే వీరిద్దరూ తరుచూ అశ్లీల వీడియోలు చూస్తూ ఉండేవారు.క్రమక్రమంగా వీళ్ళిద్దరూ అశ్లీల వీడియోలకు బానిసలు అయిపోయారు.

 Kakinada Ramu Siva Kites Sankranthi-అశ్లీల వీడియోలు ప్రభావంతో చిన్నారి పై గ్యాంగ్ రేప్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో వీరిద్దరిలో కామవాంఛలు కట్టలు తెంచుకున్నాయి.దీంతో సంక్రాంతి పండుగ రోజున పతంగులు ఎగురవేసేందుకు చిన్నారిని ఎవరు లేనటువంటి ఓ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు.

అనంతరం ఆ చిన్నారిని వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టారు.

అయితే అదే సమయంలో ఆ చిన్నారి తల్లి చిన్నారికి  స్నానం చేయించడానికి తీసుకు వెళ్ళింది.ఈ క్రమంలో చిన్నారి జననాంగాల వద్ద రక్తస్రావం అవుతుండడాన్ని ఆమె గమనించింది.దీంతో ఏం జరిగిందని చిన్నారిని అడగ్గా ఆ చిన్నారి తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి మరియు ఆ ఇద్దరు యువకుల గురించి తెలిపింది.

దీంతో ఆమె వెంటనే దగ్గరలో ఉన్నటువంటి కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్లో యువకులపై ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఈ నేరం చేసినట్లు వారు అంగీకరించారు.

దీంతో వారిని అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

#Kakinada #EastGodavari #EastGodavari #EastGodavari #EastGodavari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు