బాలీవుడ్‌లో లైంగిక వేదింపులు ఉన్నాయన్న టాప్‌ హీరోయిన్‌, కాని..!  

బాలీవుడ్‌తో పాటు ప్రస్తుతం అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా లైంగిక వేదింపుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున లైంగిక వేదింపుల గురించి మాట్లాడుతున్న ఈ సమయంలోనే మాజీ బాలీవుడ్‌ హీరోయిన్‌ తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. నానా పటేకర్‌తో పాటు తనను పలువురు లైంగికంగా వేదించారని, తనకు చాలా ఇబ్బంది కలిగించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చారు.

Kajol Supports To Tanushree Dutta-

Kajol Supports To Tanushree Dutta

తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలకు కొందరు తమ మద్దతు తెలుపుతుండగా మరి కొందరు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా ఆమెపై బౌతిక దాడి కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆమెకు పోలీసులు సెక్యూరిటీని కూడా పెంచారు. ఇక లైంగిక వేదింపుల విషయంలో బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోయిన్స్‌ పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌ స్పందిస్తూ తనూశ్రీ దత్తాకు తన మద్దతు ప్రకటించింది.

Kajol Supports To Tanushree Dutta-

లైంగిక వేదింపులు సినిమా పరిశ్రమలో ఉన్నాయని, అయితే ఇవి కేవలం సినిమా పరిశ్రమలోనే కాకుండా దాదాపు అన్ని రంగాల్లో కూడా ఈ వేదింపుల వ్యవహారం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. లైంగిక వేదింపులు తనకు ఎప్పుడు ఎదురు కాలేదని, అయితే లైగింకంగా కొందరు వేదింపులకు గురయినట్లుగా తన వద్ద సమాచారం ఉందని చెప్పుకొచ్చింది. జనాల్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ లైంగిక వేదింపులు అనేవి తగ్గుతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్న ‘మీటూ’ అనే ఉద్యమం ఇక్కడ కూడా రావాలని కాజోల్‌ కోరుకుంటుంది.