మా పెళ్లి కోసం అతడికి అజయ్ దేవగణ్ డబ్బులు ఆఫర్ చేశాడు!

సినీ పరిశ్రమలో నటీనటులు చాలామంది పెళ్లి జీవితంలోకి మరో నటీనటులను ఎంచుకున్నారు.ఇలా టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా చేసుకున్న నటి నటులు చాలామందే ఉన్నారు.

 Ajay Devgan And Kajol Marriage Anniversary Special Post,  Kajol, Ajay Devgn, Mar-TeluguStop.com

ఇక బాలీవుడ్ లో కూడా ఎంతోమంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే మరో జంట కాజోల్, అజయ్ దేవగన్ కూడా ఈ తరహా కే చెందిన వాళ్లు.

వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక వీళ్లూ 1999లో జనవరి 24న పంజాబీ లో మహారాష్ట్ర సాంప్రదాయ ప్రకారం కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

వీరికి ఓ కూతురు ఓ కొడుకు ఉన్నారు.నిన్నటితో వీరి పెళ్లి జరిగి 22 ఏళ్లు పూర్తికాగా కొన్ని ఫోటోలను కాజోల్ సోషల్ మీడియాలో తన అభిమానులకు పంచుకుంది.

Telugu Ajay Devgn, Anniversary, Kajol, Marrige, Sweet, Tanaji-Movie

అంతేకాకుండా తమ పెళ్లి లో జరిగిన కొన్ని మధుర క్షణాలు కూడా గుర్తు చేసుకొని అందరితో పంచుకుంది.తమ పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్న ఏ రోజు కూడా తను ఒంటరిగా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది.ఇక తమ పెళ్లి జరుగుతున్న సమయంలో తన భర్త అజయ్ దేవ్ గన్ అగ్ని చుట్టూ తిరుగుతున్న సమయం లో చాలా తొందర పెట్టాడని, వీలైనంత త్వరగా పెళ్ళి తంతు ముగించాలని పురోహితుడికి డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడని కొన్ని సరదా విషయాలను పంచుకుంది.అంతేకాకుండా ఇటీవలే తెరకెక్కిన ‘తానాజీ: డి అన్ సంగ్ వారియర్’ సినిమాలు వీరిద్దరూ కలిసి నటించగా అందులో భార్యాభర్తలుగా కనిపించిన సంగతి తెలిసిందే.ఇక కాజోల్ పంపిన తమ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube