టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లతో ప్రేక్షకులను ఎలా మెప్పించిందో అందరికీ తెలిసిందే.ఆమె చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో, ఆమెను లక్కీ గర్ల్‌గా భావించారు.
ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.దీంతో ఆమె ఫ్యాన్స్ చాలా మంది ఆమెను ఫాలో అవుతుంటారు.
కాగా తాజాగా కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌లు, జిమ్‌లు, ఈవెంట్స్ అన్నీ కూడా వాయిదా పడటంతో కాజల్ అగర్వాల్ ఇంట్లోనే ఉంటూ తన రోజూవారి పనులను కానిచ్చేస్తుంది.దీనికి సంబంధించిన ఓ ఫోటోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఈ పోటోలో ఆమె ఇంట్లోనే వర్కవుట్ చేస్తూ కనిపించింది.రోజూ చేసే వర్కవుట్లు ఇంట్లో ఉండైనా చేసుకోవచ్చని కాజల్ తన అభిమానులకు తెలిపింది.
ఇలా ఇంట్లో ఉంటూ కూడా తన వర్కవుట్స్‌ను కానిస్తున్న కాజల్‌పై ఆమె ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఏదేమైనా తమ అభిమాన హీరోయిన్ ఇలా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఇంట్లో ఉంటూనే తన ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం నిజంగా గ్రేట్ అంటున్నారు.