కాజల్ ని వాడేసుకుందామని ఫిక్స్ అయ్యారు

అటు బ్రహ్మోత్సవం షూటింగ్ మెల్లిగా జరుగుతుందని సూపర్ స్టార్ అభిమానులు బాధపడుతుంటే, అసలు షూటింగ్ జరుగుతుందా లేదా ? ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు ఆగిపోద్దో అనే కన్ఫ్యూజన్ తో అల్లాడిపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.హీరోయిన్స్ ని మార్చి మార్చి చివరకు అగ్ర కథానాయిక కాజల్ ని ప్రాజెక్ట్ లోకి లాకున్నారు.

 Kajal Will Join Sardaar Sets This 17th-TeluguStop.com

అక్కడివరకు బాగానే ఉంది.అప్పుడెప్పుడో షూటింగ్ మొదలైతే ఇంతవరకు కాజల్ సర్దార్ సెట్స్ ని పలకరించకపోవటం గమనార్హం.

ఇది ఇలాగే సాగితే సినిమా పూర్తీ అయ్యేది ఎప్పుడు అని బెంగపడుతున్న పవన్ అభిమానులకి శుభవార్త.కాజల్ అగర్వాల్ వచ్చేస్తోంది.

పవర్ స్టార్ తో కలిసి చిందులేసేందుకు సిద్ధమవుతోంది.ఈ రోజే బ్రహ్మోత్సవం కొత్త షెడ్యుల్ మొదలవుతుందటంతో సూపర్ స్టార్ తో ఆడిపాడుతున్న కాజల్, షెడ్యుల్ ఇలా పూర్తీ అవగానే అలా పవర్ స్టార్ దగ్గర వాలిపోతుంది.

సర్దార్ తదుపరి షెడ్యుల్ గుజరాత్ లో అన్న సంగతి తెలిసిందే.ఈ నెల 17 నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొననుంది కాజల్.

గుజరాత్ లో పెద్ద షెడ్యుల్ ప్లాన్ చేసారు.కాజల్ డేట్స్ ఉన్న రోజులన్నీ ఫుల్ గా వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయారంట యూనిట్.

తాము ఆలస్యం చేస్తే మళ్ళి ఆ ముద్దుగుమ్మ డేట్స్ దొరకడం కష్టం కదా.కాజల్ డిమాండ్ అలాంటిది మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube