కెరీర్ ప్రారంభంలోనే భారీగా డిమాండ్ చేసిన కాజల్.. వద్దుపొమ్మ అని పక్కనపెట్టేసిన నిర్మాత?

Kajal Was In High Demand At The Beginning Of Her Career

సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు కెరీర్ మొదట్లోనే కొన్ని కొన్ని షాక్ లు ఇస్తుంటారు.చాలావరకు పారితోషకం విషయంలోనే బాగా డిమాండ్ చేస్తూ ఉంటారు.

 Kajal Was In High Demand At The Beginning Of Her Career-TeluguStop.com

ఇండస్ట్రీకి అడుగుపెట్టి రెండు మూడు సినిమాలతోనే తాము నిర్మాతలతో పారితోషికం విషయంలో గొడవలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ కూడా పారితోషికం విషయంలో బాగా డిమాండ్ చేసిందట.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయం అయింది కాజల్.ఆ తర్వాత చందమామ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఈ సినిమాతోనే మెల్ల మెల్లగా స్టార్ హోదాను సంపాదించుకుంటుంది.

 Kajal Was In High Demand At The Beginning Of Her Career-కెరీర్ ప్రారంభంలోనే భారీగా డిమాండ్ చేసిన కాజల్.. వద్దుపొమ్మ అని పక్కనపెట్టేసిన నిర్మాత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత వరుసగా వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలలో రేంజ్ లో దూసుకెళ్లింది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా నటించింది.గత ఏడాది గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Telugu Acharya Movie, Career, Chiranjeevi, Film Industry, Heroine, Kajal, Magadheera Movie, One And Half Crore Remuneration, Producer Ms Raju, Tollywood-Movie

ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.అందులో ఎక్కువగా పలు బిజినెస్ లు ప్రారంభించి బాగా లాస్ అయింది.అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా విమర్శలు ఎదుర్కొంది.

ఇదిలా ఉంటే గతంలో మగధీర సినిమా సమయంలో కాజల్ పారితోషికం విషయంలో డిమాండ్ చేసిందని తెలిసింది.

Telugu Acharya Movie, Career, Chiranjeevi, Film Industry, Heroine, Kajal, Magadheera Movie, One And Half Crore Remuneration, Producer Ms Raju, Tollywood-Movie

మగధీర సినిమాతో స్టార్ హోదా ను అందుకుంటున్న తరుణంలో ఆ తర్వాత కాజల్ కు మరో సినిమాలో అవకాశం వచ్చింది.ఎమ్మెస్ రాజు నిర్మించిన సినిమాలో కాజల్ అగర్వాల్ కు అవకాశం రాగా ఈ సినిమాకు కాజల్ కోటిన్నరకు పైగా పారితోషకం డిమాండ్ చేసిందని తెలిసింది.పైగా ఈ సినిమా మామూలు సినిమా కావడంతో కూడా ఈ సినిమాకు అంత పారితోషకం డిమాండ్ చేయడంపై కాజల్ పై విమర్శలు చేశారు.

ఇక ఆ నిర్మాత వద్దు పొమ్మ అని కాజల్ అగర్వాల్ ను పక్కన పెట్టేసాడట.

Telugu Acharya Movie, Career, Chiranjeevi, Film Industry, Heroine, Kajal, Magadheera Movie, One And Half Crore Remuneration, Producer Ms Raju, Tollywood-Movie

అలా కాజల్ అగర్వాల్ కెరీర్ మొదట్లోనే పారితోషికం విషయంలో డిమాండ్ చేయడం వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొంది.ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ వరుస సినిమాలలో బిజీగా ఉంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాతో పాటు నాగార్జున నటిస్తున్న ఓ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.

వీటితో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది కాజల్ అగర్వాల్.కారణం ప్రస్తుతం సినిమా షూటింగులు పూర్తికాగా తర్వాత సినిమాల షూటింగులకు వెళ్లేముందు తన భర్త గౌతమ్ తో కాస్త సమయాన్ని గడిపేందుకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

#Acharya #Career #Chiranjeevi #Kajal #Crore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube