కాజల్‌ దుమ్ము రేపింది కాని... 'సీత' టాక్‌ ఏంటో తెలుసా?  

Kajal Veary Good Acting In Sita Movie-bithiri Sathi,kajal,sai Srinivas,sita,teja,కాజల్

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ తాజాగా ‘సీత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించాడు. ఈ చిత్రంలోని హీరో పాత్ర కాస్త అటు ఇటుగా స్వాతిముత్యం చిత్రంలోని కమల్‌ హాసన్‌ పాత్రకు దగ్గరగా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ఇదే సమయంలో ఈ చిత్రంలోని సీత పాత్రలో నటించిన కాజల్‌ నటన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది..

కాజల్‌ దుమ్ము రేపింది కాని... 'సీత' టాక్‌ ఏంటో తెలుసా?-Kajal Veary Good Acting In Sita Movie

పెద్ద ఎత్తున కాజల్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

కాజల్‌ మంచి నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా మాత్రం ఏమాత్రం మెప్పించలేక పోయింది.

దర్శకుడు తేజ చాలా రొటీన్‌గా స్క్రీన్‌ప్లేను నడిపించాడు. కొన్ని బోరింగ్‌ సీన్స్‌తో ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో నడిపించాడు. అసలు ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు బాబోయ్‌ అన్నట్లుగా ఉన్నాయి.

సీత పాత్రలో నటించిన కాజల్‌ మాత్రమే ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచింది. కాజల్‌ కూడా అంతత మాత్రమే అయితే ఇక సినిమా కనిపించకుండా పోయేది.

ఈ చిత్రంతో దర్శకుడు తేజ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాననే నమ్మకం వ్యక్తం చేశాడు. కాని తేజ మాత్రం తన మాటను నిలుపుకోలేక పోయాడు.

చాలా నమ్మకంతో కనిపించిన తేజకు ఈ చిత్రం నిరాశ పర్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ నిరాశగా ఉన్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.