మా ప్రేమ పెళ్లి ఓ సినిమా కథ అంటున్న కాజల్..!

టాలీవుడ్ సినీ నటి కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ వరుస సినిమాల్లో బిజీగా ఉంది.

 Kajal Tells The Story Of Our Love Marriage Movie-TeluguStop.com

తన అందాలతో ఎంతోమంది అభిమానం పెంచుకున్న ఈ భామ.తన పెళ్లి తర్వాత కూడా మరింత అందాన్ని పెంచుకుంటూ దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే మంచు విష్ణుతో కలిసి నటించిన మోసగాళ్ళు సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

పెళ్లి తర్వాత సినిమాలలోకి ఇక నటించిందని వార్తలు వినిపించగా అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని తెలిసేలా చేసింది కాజల్.ఇదిలా ఉంటే కాజల్ మంగళవారం హైదరాబాదులో విలేకరులతో కొన్ని విషయాలు పంచుకుంది.

ఇక తాను సినిమాలలో పాత్రల ఎంపికలో ఎలాంటి మార్పు కోరుకుంటలేదట.ఇదివరకు ఒప్పుకున్న కథలనే చేయడంతోపాటు తాను వ్యక్తిగతంగా సెన్సార్ అనే నియమం పెట్టుకుందట.

ఇక తనకు ప్రేమ కథలు, పౌరాణిక గాథలన్న ఇష్టమట.

Telugu Goutham Kichlu, Kajal, Love Marrige, Tollywood-Movie

ఇక తన వ్యక్తిగత గురించి కొన్ని విషయాలు చెప్పగా తన భర్త గౌతమ్, ఆమె మంచి స్నేహితులు అని తెలిపింది.ఇక వారి మధ్య ఉన్న పరిచయం గురించి ప్రశ్నించగా అది ఒక సినిమా స్టోరీ అవుతుంది అని తెలుపు కొచ్చింది.ఇక వారు పదేళ్లుగా ఒకరికొకరు పరిచయం ఉండటమే కాకుండా వారి మధ్య డేటింగ్ లేదని తెలిపింది.

లాక్ డౌన్ లో వారి స్నేహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నారట.ఇక వారి పెళ్లి గురించి గౌతమ్ తన నాన్నతో అడగగా వెంటనే ఒప్పుకున్నారని తెలిపింది.

ఇక వారిది లాక్ డౌన్ పెళ్లి అని చెప్పుకొచ్చింది.ఇక పెళ్లి తర్వాత విడుదలవుతున్న మోసగాళ్లు సినిమా గురించి కొన్ని విషయాలు తెలపగా త్వరలోనే విడుదలవుతుందని చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube