పెళ్లి తర్వాత నో హనీమూన్… నవంబర్ రెండో వారం నుంచే కాజల్ షూటింగ్  

Kajal takes no big break after marriage, Tollywood, Telugu Cinema, South Heroines, Celebrity Marriages, Acharya Movie - Telugu Acharya Movie, Celebrity Marriages, Kajal Agagrwal, South Heroines, Telugu Cinema, Tollywood

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొత్తానికి పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.గౌతమ్ కిచ్లూని బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుకతో పెళ్ళాడింది.

TeluguStop.com - Kajal Takes No Big Break After Marriage

వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాజల్ పెళ్లి వేడుక అంటే ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకి కొంత వరకు ఆ ఫోటోలు ఆనందాన్ని అందించాయి.

సంప్రదాయ పద్ధతిలో కాజల్ ని గౌతమ్ పెళ్లి చేసుకున్నాడు.ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ సినిమాలకి స్వస్తి చెప్పేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది.

TeluguStop.com - పెళ్లి తర్వాత నో హనీమూన్… నవంబర్ రెండో వారం నుంచే కాజల్ షూటింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే పెళ్లి తర్వాత హనీమూన్ ఉంటుంది కాబట్టి కొత్త సినిమాలు స్టార్ట్ చేయడానికి సమయం తీసుకుంటుంది అని కూడా భావించారు.అయితే కాజల్ మాత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా హనీమూన్ వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఆమె నవంబర్ రెండో వారంలో ఆచార్య షూటింగ్ లో పాల్గొనడానికి ఇప్పటికే టీమ్ కి ఇంటిమేట్ చేసిందని సమాచారం.నవంబర్ 2 నుంచి ఆచార్య సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతుంది.

చిరంజీవి కూడా ఇదే షెడ్యూల్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారు.ఇక కాజల్ అగర్వాల్ రెండో వారంలో షూటింగ్ లో జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.

ఆ తర్వాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తుందని తెలుస్తుంది.కరోనా సిచువేషన్ కంట్రోల్ అయిన తర్వాత హనీమూన్ వేడుక జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్, తమన్నా మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తుంది.

#Kajal Agagrwal #South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Takes No Big Break After Marriage Related Telugu News,Photos/Pics,Images..