కాజల్‌ ఔనంది.. ప్రస్తుత స్టార్‌ హీరోయిన్స్‌లో ఈమెదే అసలైన లక్‌   Kajal Says Ok To Director Shankar Movie For Indian 2     2018-12-04   09:48:46  IST  Ramesh P

లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కాజల్‌ ‘చందమామ’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ‘మగధీర’ చిత్రంతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మగధీర చిత్రం నుండి ఇప్పటి వరకు కాజల్‌ స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతూ వస్తోంది. మద్యలో కొన్ని ఫ్లాప్‌లు పడ్డా, కాస్త గ్యాప్‌ వచ్చినా కూడా ఈమె మాత్రం టాప్‌ స్టార్‌గానే దూసుకు పోతుంది. దశాబ్ద కాలంగా స్టార్‌ హీరోయిన్‌ గా, స్టార్‌ హీరోల సరసన నటిస్తున్న కాజల్‌ కెరీర్‌ ముగిసి పోతుందని భావిస్తున్న సమయంలో కెరీర్‌లోనే అతి పెద్ద ఆఫర్‌ తలుపు తట్టింది.

ప్రతి హీరో, హీరోయిన్‌ కూడా శంకర్‌ దర్శకత్వంలో ఒక్క చిన్న పాత్ర అయినా కూడా చేయాలని భావిస్తారు. కాని కాజల్‌కు ఏకంగా హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. మెల్ల మెల్లగా క్రేజ్‌ తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో కాజల్‌కు ఇంత పెద్ద ఆఫర్‌ రావడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. ఇండియన్‌ 2లో కాజల్‌ నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై మొదట కొందరు పెదవి విరిచారు. అంత సీన్‌ కాజల్‌కు లేదులే అనుకున్నారు. కాని తాజాగా కాజల్‌ ఔను అంటూ క్లారిటీ ఇచ్చింది. తాను కమల్‌ హాసన్‌ గారితో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించింది.

Kajal Says Ok To Director Shankar Movie For Indian 2-Indian 2 Agarwal Kamal Haasan Viral About

ప్రస్తుతం ఉన్న సీనియర్‌ హీరోయిన్స్‌ లో కాజల్‌ చాలా లక్కీ అని చెప్పుకోవాలి. కాజల్‌తో ఎంట్రీ ఇచ్చిన వారు, కాజల్‌ తర్వాత ఎంట్రీ ఇచ్చిన వారు స్టార్స్‌గా పేరు తెచ్చుకోవడం, కనుమరుగవ్వడం కూడా జరిగి పోయింది. కాని కాజల్‌ మాత్రం ఇంకా శంకర్‌ వంటి దిగ్గజ దర్శకుడితో సినిమా చేయబోతుంది. శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తే కాజల్‌ మరో అయిదు సంవత్సరాల పాటు టాప్‌ హీరోయిన్‌గా కొనసాగే అవకాశం ఉంది. అందుకే కాజల్‌దే అసలైన లక్‌ అంటున్నారు విశ్లేషకులు. వచ్చే నెలలో ఈ చిత్రంను పట్టాలెక్కించేందుకు శంకర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.