బాలయ్యతో రొమాన్స్ కి రెడీ అవుతున్న సీత!  

బాలకృష్ణ తో రొమాన్స్ కి రెడీ అయిన కాజల్ .

Kajal Romance With Balakrishna-ruler Movie,telugu Cinema,tollywood

ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ తర్వాత బాలకృష్ణ బోయపాటితో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే బోయపాటికి వినయ విదేయ రామా లాంటి డిజాస్టర్ తగలడంతో బాలకృష్ణ ఆలోచనలో పడి నెక్ట్ిబ సినిమాని సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో జై సింహ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది..

బాలయ్యతో రొమాన్స్ కి రెడీ అవుతున్న సీత! -Kajal Romance With Balakrishna

అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకున్న కెఎస్ రవికుమార్ చెప్పిన స్టొరీ బాలయ్యకి భాగా కనెక్ట్ కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు కెఎస్ రవికుమార్ రూలర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కాజల్ ని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే మెగాస్టార్ తో జత కట్టిన కాజల్ బాలయ్యతో కూడా రొమాన్స్ కి రెడీ అయితే టాలీవుడ్ లో యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో ఆడిపాడిన హీరోయిన్ గా మరో రికార్డ్ ని ఖాతాలో వేసుకుంటుంది. త్వరలో సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న కాజల్ బాలయ్యకి జోడీగా అంటే కాస్తా ఆసక్తికరంగానే ఉంది అని చెప్పాలి.