నగ్మని గుర్తు చేస్తున్న కాజల్ అగర్వాల్! సీత కోసం ఇగో పెంచుకుంది

ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసిన నటి నగ్మా అన్న సంగతి తెలిసిందే.ఇక ఈ భామ కెరియర్ లో ఎక్కువగా పొగరుబోతు పాత్రలని చేసేది.

 Kajal Play To Role In Seeta Look Like Heroine Nagma Movies-TeluguStop.com

అలాంటి పాత్రలని చాలా సునాయాసంగా చేసేసి, పవర్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది.ఈ భామతో ఎంతగా గ్లామర్ క్యారెక్టర్స్ చేయించిన వాటిలో కూడా ఇగో ఉన్న ఆడపిల్లగానే ఆమె పాత్రలు ఉండేవి.

అయితే నగ్మా తర్వాత తెలుగులో అలాంటి పాత్రలలో ఇప్పటి వరకు ఇతర హీరోయిన్స్ పెద్దగా కనిపించలేదు.ఒకరిద్దరు హీరోయిన్స్ చేసిన కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

అయితే చాలా కాలం తర్వాత మరో సారి నగ్మా చేసిన పాత్రల తరహాలో సీత సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రని దర్శకుడు తేజ ప్రేక్షకులకి పరిచయం చేసాడు.ఎప్పుడు కమర్షియల్ హీరోగా, ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలలో కనిపించే బెల్లంకొండ ఈ సారి సీత కోసం ఇన్నోసెంట్ హీరోగా మారిపోయాడు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకి దర్శకుడు తీసుకొచ్చాడు.ఇందులో కాజల్ ఎలాంటి ఎమోషన్స్ లేని ఓ పవర్ ఫుల్, యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిగా చూపించాడు.

ఇప్పటి వరకు ఇలాంటి పొగరుబోతు పాత్రలలో నగ్మాని మాత్రమె చూసిన తెలుగు ఆడియన్స్ ని కాజల్ ఆ పాత్రలో ఎ మేరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube