మరొక సినిమా నుండి తప్పుకున్న కాజల్..ఎందుకంటే!

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అందాల చందమామ కాజల్ అగర్వాల్.కాజల్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నప్పుడే తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లి తర్వాత కూడా సినిమాలు ఆపలేదు.అంతే హుషారుగా మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ దూసుకు పోతుంది.కానీ గత కొన్ని రోజులుగా కాజల్ ప్రెగ్నెంట్ అని వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Kajal Out From Another Film, Kajal Agarwal, Kajal Agarwal Next Movie, Kajal Agga-TeluguStop.com

అందులో నిజమెంత ఉందొ తెలియదు కానీ వాటిపై కాజల్ మాత్రం అధికారికంగా స్పందించక పోవడంతో ఈ వార్తలు నిజమేనని అందరు భావిస్తున్నారు.

అందుకు కొన్నిటిని కారణాలుగా కూడా చూపిస్తున్నారు.కాజల్ ప్రెగ్నెంట్ అయినందు వల్లనే కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని.ఒప్పుకున్నా సినిమాల నుండి కూడా ఒక్కొక్కటిగా తప్పుకుంటుందని కథనాలు వస్తున్నాయి.

Telugu Kajal Agarwal, Kajal Aggarwal, Kajal, Kollywood, Nagarjuna, Pregnant, Gho

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గోస్ట్‘ సినిమా నుండి ఇప్పటికే కాజల్ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో కాజల్ నటింస్తుందని చిత్ర యూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి కాజల్ తప్పుకుందని టాక్ రావడంతో కాజల్ తప్పకుండ ప్రెగ్నెంట్ అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Telugu Kajal Agarwal, Kajal Aggarwal, Kajal, Kollywood, Nagarjuna, Pregnant, Gho

అయితే తాజాగా కాజల్ మరొక సినిమా నుండి తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.కోలీవుడ్ లో వస్తున్నా కథనాల ప్రకారం ఒక తమిళ్ సినిమా నుండి కాజల్ తప్పుకుందని తెలుస్తుంది.కాజల్ స్థానంలో హన్సిక నటిస్తుందని టాక్.జెఎం శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.అయితే ఇప్పుడు కాజల్ ప్రెగ్నెంట్ అవడం వల్లనే అన్ని సినిమాల నుండి తప్పుకుంటుందని కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది.మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube