పెళ్లి తరువాత బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్... అదేంటంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ పరిచయం అక్కరలేని పేరు.లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాలో నటనతో మంచి పేరు సంపాదించుకుంది.

 Kajal Makes A Bumper Offer After Marriage  Is That So, Actress Kajal Aggarwal, T-TeluguStop.com

ఆ తరువాత చందమామ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోయిన్ గా మొదటి హిట్ అందుకుంది.ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా మగధీర తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక ఆ సినిమా తరువాత ఇక కాజల్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.

ఇటీవల కాజల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే పెళ్లికి ముందు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్ పెళ్లి తరువాత ఛాలెంజింగ్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ “రా ఏజెంట్” పాత్రలో కనిపించనుందట.రా ఏజెంట్ పాత్ర అంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర.

ఇలా పెళ్లి తరువాత నటనకు ప్రాధాన్యత గల పాత్రల ఆఫర్ లతో కాజల్ ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube