తన ఒరిజినల్ లుక్ ని రివీల్ చేసిన కాజల్! హీరోయిన్స్ కి చాలెంజ్

హీరోయిన్స్ ని చాలా వరకు ఎప్పుడు మేకప్ లోనే చూస్తూ ఉంటాం.చాలా తక్కువ మంది భామలు మేకప్ లేకుండా బయటకి వస్తూ ఉంటారు.

 Kajal Looks Viral Without Mack Up-TeluguStop.com

ఇక నార్త్ హీరోయిన్స్ అయితే మేకప్ లేకుండా ఒక్క అడుగు కూడా బయట పెట్టరు.దీంతో చాలా మంది హీరోయిన్స్ ఒరిజినల్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయం ఎవరికి తెలియదు.

ఇక హీరోయిన్స్ ఒరిజినల్ లుక్ చూస్తే మామూలుగా తిరిగి అమ్మాయిల కంటే దారుణంగా ఉంటారని చాలా మంది చెబుతూ ఉంటారు.ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ధైర్యం చేసి మేకప్ లేకుండా తన ఒరిజినల్ లుక్ ఎలా ఉంటుంది అనేది చూపించింది.

కాజల్ అగర్వాల్ తాజా సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా థియేటర్ లో డిజాస్టర్ గా మారిపోయింది.ఇదిలా ఉంటే మరో వైపు స్టార్ హీరోయిన్ గా ఉన్న కాజల్ కి అవకాశాలు భాగానే ఉన్నాయి.తాజాగా కాజల్ తన ఒరిజినల్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

ఇక ఈ ఫోటోలు చూసిన వారు ఆమె నిజంగా కాజల్ అనే నమ్మలేకపోయారు.అయితే ఇప్పుడు కాజల్ తన ఒరిజినల్ లుక్ ని చూపించడమే కాకుండా నేటి తరం హీరోయిన్స్ కి చిన్న చాలెంజ్ కూడా ఇచ్చింది.

మేకప్ వేస్తే ప్రపంచం అంతా మనల్ని అభిమానిస్తుంది కాని మేకప్ మన బయటి అందాన్ని మాత్రమే చూపిస్తుంది అది ఎప్పటికి శాశ్వతం కాదు.మన అసలు రూపాన్ని మనం అభిమానించుకోవాలి అప్పుడే మన ఆత్మ విశ్వాసం మనతో ఉంటుంది అనే కామెంట్ చేసి మిగిలిన హీరోయిన్స్ కూడా తన ఒరిజినల్ లుక్ చూపించాలని చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube