మోసగాళ్లులో కాజల్ లుక్ అదిరిందిగా!

అందాల భామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతూనే ఉంది.ఇప్పటికే దశాబ్ధ కాలంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ఈ బ్యూటీ, తన స్థానాన్ని దక్కించుకుంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.

 Kajal Look In Mosagallu Revealed, Kajal Aggarwal, Mosagallu, Manchu Vishnu, Kaja-TeluguStop.com

కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన ఈ బ్యూటీ, త్వరలో రాబోయే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనుంది.

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ అనే థ్రిల్లర్ యాక్షన్ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ పలు భాషల్లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను హాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నారు చిత్ర యూనిట్.

భారత్‌లో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌ను మనకు ఈ సినిమాలో చూపించబోతున్నారు చిత్ర యూనిట్.

పలువురు ట్యాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలోని కాజల్ అగర్వాల్ లుక్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ లుక్‌లో ఆమె ముఖాన్ని సగమే చూపించారు.మిగతా సగం మంచు విష్ణు ముఖంతో రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాలో అను అనే పాత్రలో ఆమె నటిస్తోంది.పోస్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube