నిజం ఒప్పేసుకున్న కాజల్.. చివరకు అలాంటి పాత్రలో..!  

Kajal Gives Clarity On Her Role In Indian 2-kajal,kajal Aggarwal,kamal Haasan,shankar

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ దాదాపు 12 ఏళ్ల నుండి తెలుగు ప్రేక్షకులను తన నటనతో పాటు అందచందాలతో అలరిస్తూ వస్తోంది.స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన సినిమాల జోరును బాగా తగ్గించేసింది.

Kajal Gives Clarity On Her Role In Indian 2-Kajal Kajal Aggarwal Kamal Haasan Shankar

ప్రస్తుతం అరకొర సినిమాలే అమ్మడికి దిక్కుగా మారాయి.

అయితే ఇందులో ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలు కావడం విశేషం.

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘ఇండియన్ 2’.గతంలో వచ్చిన ఇండియన్ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.అయితే కాజల్ పాప ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందనే అంశంపై గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు షికారు చేస్తున్నాయి.

కాగా తాజాగా ‘ఇండియన్ 2’ సినిమాలో తన పాత్రపై కాజల్ క్లారిటీ ఇచ్చింది.ఈ సినిమాలో ఆమె 85 ఏళ్ల ముసలావిడ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు.

దీంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల డౌట్ కూడా తీరిపోయింది.ఇక ఈ సినిమాలో కమల్ తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్ర తనదేనని కాజల్ చెప్పింది.

కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా రకుల్ నటిస్తుందనే వార్త వినిపిస్తుంది.కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.

తాజా వార్తలు

Kajal Gives Clarity On Her Role In Indian 2-kajal,kajal Aggarwal,kamal Haasan,shankar Related....