ఫాన్స్ కు పెద్ద షాక్ ఇవ్వనున్న "కాజల్".! ఇక సినిమాలకు సెలవు..! కారణం ఏంటంటే.?       2018-06-05   03:06:28  IST  Raghu V

మనం తెలుగు వాళ్ళం. సినిమాలు మన లైఫ్ లో ఒక భాగం అంటే అతిశయోక్తి కాదు. వినోదానికి మనం అంత ప్రాధాన్యత ఇస్తుంటాము. ప్రస్తుతం మన తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే.? అధిక శాతం మందికి గుర్తొచ్చే హీరోయిన్ కాజల్. పది సంవత్సరాల నుండి తెలుగులో సక్సెఫుల్ కెరీర్ తో దూసుకుపోతుంది ఈ సుందరి. అయితే దక్షిణాదిలో అగ్రనాయకిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీకిప్పుడు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌అగర్వాల్‌కు ఇప్పుడు ప్యారీస్‌ ప్యారీస్‌ చిత్రం మాత్రమే చేతిలో ఉంది. టాలీవుడ్‌లోనూ ప్రముఖ హీరోల చిత్రాలేవీ లేవు.

దీంతో పెళ్లికి సిద్ధం అవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. కుటుంబం కోసం ఎందాకైనా రెడీ అంటోంది. ఈ విషయం అలా ఉంచితే కాజల్‌ మైండ్‌ సెట్‌ మారినట్లు ఆమె మాటల ద్వారా అనిపిస్తోంది. ఇంతకీ కాజల్‌అగర్వాల్‌ ఏమంటుందో చూద్దాం. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు. ఉద్యోగం పోతే మళ్లీ దొరుకుతుంది. అయితే కుటుంబ సంబంధాలను ఒక్కసారి కోల్పోతే మళ్లీ పొందడం కష్టం.

సినిమా జీవితానికి దూరం కావడానికి రెడీ. నేటి తరం జీవితాల్లో వేగం పెరిగింది. కుటుంబ అనుబంధాల గురించి తెలిసినా చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. అందుకు కారణాల గురించి ఆలోచించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఎందుకు విడిపోయాం అన్న విషయం గురించి కొంచెం ఆలోచిస్తే, ఇంత చిన్న విషయం గురించా విడిపోయామా అని అనిపిస్తుంది. మళ్లీ కలుసుకుంటాం. డబ్బు కంటే మనుషులు ముఖ్యం. వారిని గౌరవించండి అని అంటోంది నటి కాజల్‌అగర్వాల్‌. ఇంతకీ సడన్‌గా ఇలా అనుబంధాల గురించి ఉపోద్ఘాతం ఏమిటీ? ఈ అమ్మడి మాటల్లో గూడార్ధం ఏమై ఉంటుందీ? అని అలోచన్లో పడ్డారా? అయితే ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది.