కాజల్ నిశ్చితార్థ ఉంగరం చాలా కాస్ట్లీ గురూ!  

kajal aggarwal show off huge engagement ring Kajal Engagement Ring, Kajal Agarwal, Gautham Kchulu, Bussinessman, Bellam Konda Srinivas, Tollywood Stars, Kajal Engagement Ring 10 Lakhs Worth, Acharya, Chiranjeevi, Coronavirus, Lock Down - Telugu @mskajalaggarwal, Acharya, Bellam Konda Srinivas, Coronavirus, Gautham Kchulu, Kajal Agarwal, Kajal Aggarwal Show Off Huge Engagement Ring, Kajal Engagement Ring, Kajal Engagement Ring 10 Lakhs Worth, Lock Down

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అయితే లాక్ డౌన్ వల్ల ఖాళీ సమయం దొరకడంతో సినిమా సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లు జరగగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును త్వరలో వివాహం చేసుకోనుంది.15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న కాజల్ పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించనుంది.

TeluguStop.com - Kajal Engagement Ring Gautham Kchulu

ప్రస్తుతం కాజల్ చేతిలో ఆచార్య సినిమాతో పాటు మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి.చాలా రోజుల క్రితమే కాజల్ నిశ్చితార్థం జరగగా కాజల్ తాజాగా తన నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు.

ఈ వీడియోలో కాజల్ చేతికి డైమండ్ తో చేసిన రింగ్ ఉంది.ఈ రింగ్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.ఈ ఉంగరం పది లక్షల రూపాయల కంటే ఎక్కువే ఖరీదు చేస్తుందని తెలుస్తోంది.

TeluguStop.com - కాజల్ నిశ్చితార్థ ఉంగరం చాలా కాస్ట్లీ గురూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కాజల్ తన పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని భావించినా కరోనా పరిస్థితుల వల్ల పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో వివాహ వేడుకను జరుపుకోనుంది.

ఇండస్ట్రీలో కాజల్ చాలామంది హీరోలతో నటించగా కాజల్ వివాహ వేడుకకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే హాజరు కానున్నారు.ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభం కాగా పెళ్లైన కొన్ని రోజులకే కాజల్ షూటింగ్ లలో పాల్గొనబోతుందని సమాచారం అందుతోంది.

పెళ్లి తరువాత కాజల్, గౌతమ్ కిచ్లు కొత్త ఇంట్లో కాపురం చేయనున్నారు.కాజల్ కు, గౌతమ్ కిచ్లూకు చాలా సంవత్సరాల నుంచే పరిచయం ఉందని.

వీళ్లిద్దరూ స్నేహితులని తెలుస్తోంది.కాజల్ పెళ్లి జరగనున్న నేపథ్యంలో మూడు పదుల వయస్సు దాటిన టాలీవుడ్ హీరోయిన్లకు అభిమానుల నుంచి పెళ్లెప్పుడు.? అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

#BellamKonda #Gautham Kchulu #Kajal Agarwal #KajalEngagement #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Engagement Ring Gautham Kchulu Related Telugu News,Photos/Pics,Images..