ఇండియన్ 2 సెట్స్ లో కాజల్.. డేట్ కూడా కన్ఫర్మ్ చేసిన చందమామ!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Kajal Confirms Her Comeback With Indian 2, Kamal Haasan, Director Shankar, Kamal Hasan Indian 2 Movie, Kajal Aggarwal-TeluguStop.com

స్టార్ హీరోలతో మాత్రమే కాదు చిన్న హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా వరస అవకాశాలు అందుకుంటూ కుర్ర భామలకు పోటీ ఇస్తుంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా మొన్నటి వరకు అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ వచ్చింది.

 Kajal Confirms Her Comeback With Indian 2, Kamal Haasan, Director Shankar, Kamal Hasan Indian 2 Movie, Kajal Aggarwal-ఇండియన్ 2 సెట్స్ లో కాజల్.. డేట్ కూడా కన్ఫర్మ్ చేసిన చందమామ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ను కూడా ఆస్వాదిస్తోంది.ఇక పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాజల్ తల్లి కాబోతున్న నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఇటీవలే కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రెసెంట్ ఈమె మాతృత్వం లోని మాధుర్యన్ని ఆస్వాదిస్తోంది.అయితే ఈమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కన్ఫర్మ్ చేసేసింది.

అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాల్లో ఇండియన్ 2 ఒకటి.కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు రాజీ తో మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు కోలీవుడ్ మీడియా కన్ఫర్మ్ చేసేసింది.

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.

ఈ సినిమా షూట్ జరుగుతున్న సమయంలోనే ఈమె సెట్స్ నుండి దూరం అయ్యింది.అయితే ఈమె ఈ సినిమా నుండి తప్పుకుందని వస్తున్న వార్తలకు కాజల్ తాజాగా చెక్ పెట్టింది.ఈమె సెప్టెంబర్ 13 నుండి ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు అఫిషియల్ గా కాజల్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మరి ఈమె ఈ సినిమా మళ్ళీ హీరోయిన్ గా రాణిస్తుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube