ఆచార్యలో తనవంతు పూర్తి చేసిన కాజల్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా ప్రేక్షకులు తప్పనిసరిగా ఫాలో అవుతున్నారు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ ప్రేక్షకుల్లో నెలకొంది.

 Kajal Completed Her Shooting Part In Acharya, Kajal Aggarwal, Acharya, Chiranjee-TeluguStop.com

ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా షూటింగ్‌లో కాజల్ ఇటీవల జాయిన్ అయ్యింది.

ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్, తిరిగి ఆచార్య షూటింగ్‌లో జాయిన్ కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.అయితే గత పది రోజులుగా కాజల్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

తన భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన కాజల్, తన భర్తతో తిరిగి ముంబై వెళ్లిపోయింది.కాగా ఈ సినిమాలోని సాంగ్స్ కోసం మరోసారి ఆచార్య షూటింగ్‌లో కాజల్ జాయిన్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మొత్తానికి పెళ్లి తరువాత ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొన్న కాజల్, అతిత్వరగా తన పాత్ర షూటింగ్‌ను ముగించడం నిజంగా విశేషం అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇక చిరు నటిస్తున్న ఆచార్య ఓ సాలిడ్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా రానుందని, ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube