పాపం.. అప్పట్లో కాజల్ కాస్టలీ ఫ్లాట్ కొన్నందుకు అలాంటివి అంటగట్టారట!

ఎవరి సపోర్టు లేకుండా సొంత టాలెంట్ తో సినీ ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ హీరోయిన్ గా నిలిచిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.

 Kajal Bought Castley Flat But That Time And Such Things Stuck Kajal ,tollywood,-TeluguStop.com

తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించింది.

ఇదిలా ఉంటే అప్పట్లో కాజల్ చాలా పుకార్లు ఎదుర్కొంది.

తొలిసారి లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ ఆ తర్వాత చందమామ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇక మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత ఏకంగా స్టార్ హోదా ను సంపాదించుకుంది.అలా వరుస సినిమాలలో అవకాశాలు అందుకోవడమే కాకుండా స్టార్ హీరోలతో జతకట్టింది.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.గత ఏడాది ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.

స్టార్ హోదాను సంపాదించుకున్న కాజల్ ఇప్పటివరకు ఎటువంటి పుకార్లను ఎదుర్కోలేదు.

Telugu Kajal Agrawal, Acharya, Bollywood, Castley Flat, Gowtha Kichlu, Kajal, Ma

కానీ కెరీర్ మొదట్లో మాత్రం చాలా నిందలు మోసింది.స్టార్ హీరోయిన్ కాకముందు కెరీర్ మొదట్లో చిన్న హీరోయిన్ గా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ మగధీర సినిమాతో అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది.ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మ ఓ కాస్ట్ లీ ఫ్లాట్ కొన్నదట.

దీంతో కాజల్ అగర్వాల్ ఇంకా పూర్తిగా స్టార్ హీరోయిన్ గా ఎదగకముందే ఖరీదైన ప్లాట్ కొనడంతో చాలా పుకార్లు ఎదుర్కొందట.

Telugu Kajal Agrawal, Acharya, Bollywood, Castley Flat, Gowtha Kichlu, Kajal, Ma

సినీ ఇండస్ట్రీలో.ఆమెను అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనిఅంత డబ్బు సంపాదించడానికి బయట ఎలాంటి పనులు చేస్తుందో అంటూ ఇలాంటి విషయాలలో అంటగట్టారని తెలిసింది.ఇంత చిన్న హీరోయిన్ ఈ ప్లాట్ ఎలా కొనింది అని ఇండస్ట్రీలో బాగా గుసగుసలాడారట.

కానీ ప్రస్తుతం ఆమె హోదాను చూసినట్లయితే అలాంటి ప్లాట్ లను ఓ వంద కొనడానికి కూడా సిద్ధంగా ఉంది.

Telugu Kajal Agrawal, Acharya, Bollywood, Castley Flat, Gowtha Kichlu, Kajal, Ma

ఇక ఆ తర్వాత మళ్లీ ఎటువంటి పుకార్లను ఎదుర్కోలేదు కాజల్ అగర్వాల్.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటించగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించగా అవి కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

వీటితో పాటు నాగార్జునతో కూడా ఓ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉంది.

ఇక ప్రస్తుతం సినిమా షూటింగులు పూర్తవడంతో కాస్త బ్రేక్ తీసుకుందని తెలిసింది.తన పెళ్లి తర్వాత తన భర్తతో సరిగ్గా సమయాన్ని గడపడం లేదన్న విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.దీంతో తన భర్తతో కూడా సమయాన్ని గడపవచ్చు అని బ్రేక్ తీసుకున్నట్లు తెలిసింది.

బ్రేక్ తర్వాత మళ్లీ సినిమాలలో బిజీ కానుంది కాజల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube