బెల్లంకొండ బాబుతో కాజల్ పాప ప్రేమాయణం..?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు శ్రీను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.కాగా ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

 Kajal Bellamkonda Sai Messages Go Viral, Kajal Aggarwal, Bellamkonda Sai Sreeniv-TeluguStop.com

కాగా కవచం, సీత సినిమాలలో బెల్లంకొండ బాబు అందాల భామ కాజల్ అగర్వాల్‌తో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ బ్యూటీతో మనోడి రొమాన్స్ మూమూలుగా లేదు.

అయితే ఆ సినిమాల సమయంలో వారిద్దరు చాలా మంచి రిలేషన్ ఏర్పర్చుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి.కాగా తాజాగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

లాక్‌డౌన్ కారణంగా తనను మిస్ అవుతున్నా అంటూ ఆమె పోస్ట్ చేయడంతో దానికి బెల్లంకొండ బాబు రిప్లై కూడా ఇచ్చాడు.‘నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నా’ అంటూ బాబు పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఇది వైరల్ అయ్యింది.

నిజంగానే వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వాదనకు ఈ మెసేజ్‌లు బలంగా మారాయి.ఏదేమైనా వారిద్దర మధ్య ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ రిలేషన్ ఉందనే మాట మాత్రం ఈ మెసేజ్‌లతో స్పష్టం అవుతోంది.

మరి ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోండటంతో వారిద్దరిలో ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.ఇక ప్రస్తుతం బెల్లంకొండ బాబు ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తోండగా కాజల్ ఆచార్య చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube