తేజని గుడ్డిగా నమ్ముతున్న కాజల్ అగర్వాల్  

తేజ దర్శకత్వంలో మరో సినిమాకి సిద్ధం అవుతున్న కాజల్. .

Kajal Believe Director Teja Again-

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్.కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమై దశాబ్దం పైగా అయిపోతుంది.ఆమెను దర్శకుడు తేజ లక్ష్మీ కళ్యాణం సినిమాతో మొదటి సారిగా టాలీవుడ్ కి పరిచయం చేశాడు..

Kajal Believe Director Teja Again--Kajal Believe Director Teja Again-

ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడిన కూడా తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసే అవకాశం రాకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం హీరోయిన్ల హవా నడుస్తుండటంతో కాజల్ అగర్వాల్ కి అవకాశాలు కొంత మేరకు తగ్గాయి అని చెప్పాలి.తాజాగా సీత సినిమాతో తన గురువు తేజ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ అగర్వాల్ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఆయన కూడా తేజ మీద నమ్మకంతో ఉన్న ఈ భామ మరో అవకాశం అతనికి ఇచ్చినట్లు సమాచారం.అతని దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని కాజల్ అగర్వాల్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ సినిమాని తనే నిర్మాతగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ నిర్ణయాన్ని చాలామంది ఇప్పుడు వ్యతిరేకిస్తున్న కూడా దర్శకుడు తేజ టాలెంట్ మీద నమ్మకంతో ఆమె సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.