అతను విలన్.. ఆమె హీరోయిన్.. ఈ కాంబినేషన్ ఉంటే సినిమా హిట్టు పక్కా?

ఒక సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా విడుదల వరకు ఎన్నో సెంటిమెంట్లు ఎదురవుతాయి.కొన్నిసార్లు సెంటిమెంట్ పరంగానే సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు.

 Kajal And Villain Ajay Combination Movie Hit Details, Actor Ajay, Kajal Aggarwal-TeluguStop.com

అలా స్టార్ నటుల అభిమానులు కూడా కొన్ని సెంటిమెంట్ లు ఫాలో అవుతుంటారు.ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో బాగా సెంటిమెంటును నమ్ముతారు.

తమ అభిమాన స్టార్ నటులు నటించిన ప్రతి సినిమాకు ఒకటే సెంటిమెంటును ఫాలో అవుతారు.కానీ ఒక్క సినిమాలో ఆ సెంటిమెంట్ రాకపోతే ఆ సినిమా డిజాస్టర్ అని నమ్ముతారు.

అలా ఇప్పటికీ చాలామంది అభిమానులు ఇటువంటివి ఎదుర్కొన్నారు.కొన్ని కొన్ని సార్లు వ్యతిరేక పరంగా కూడా కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి.

అవి నటుల పరంగానే కాకుండా అభిమానుల నుండి కూడా సెంటిమెంట్లు ఉంటాయి.తమ అభిమాన హీరో సినిమా విడుదలైంది అంటే చాలు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తూ సినిమాకు వెళ్తారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.ఒక సినిమాలో నటించిన ఒక హీరోయిన్.

ఆమె ఏ సినిమాలో నటించిన తనకు విలన్ గా ఒక నటుడు కూడా తన సినిమాలో నటించాడు.

ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్. ఇక ఆ విలన్ నటుడు ఎవరు అంటే అజయ్. ఇక కాజల్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో అజయ్ విలన్ గా నటించాడు.ఇక ఈ సినిమాకు దర్శకుడు తేజ దర్శకత్వం వహించడు.ఈ సినిమా పల్లె నేపథ్యంలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో అజయ్ కాజల్ ను చాలా బాధపెడుతుంటాడు.

ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య 2. ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధా దాస్, బ్రహ్మానందం నటించారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2009 నవంబరు 27 న విడుదలైంది.

ఇందులో కూడా కాజల్ ను అజయ్ బాగా వేధిస్తుంటాడు.ఆ సినిమాలో అజయ్ విలన్ గా ఉంటూ కాజల్ ని ఇష్టపడతాడు.

తనని పెళ్లి చేసుకోమని వెంటపడుతూ ఉంటాడు.చివరికి తనను బెదిరిస్తూ ఉంటాడు.ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2010 లో తెరకెక్కిన సినిమా బృందావనం. ఈ సినిమాలో జూనియర్ ఎన్.టి.ఆర్., కాజల్ అగర్వాల్, సమంత ముఖ్యపాత్రలు పొషించారు.ఇక ఈ సినిమాలో కూడా అజయ్ విలన్ గా నటించాడు.

ఇందులో కూడా అజయ్ కాజల్ ను బెదిరించినట్లు కనిపించింది.ఇక ఇలా ఈ మూడు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి.దీంతో ఈ సినిమాలలో కాజల్ హీరోయిన్ గా, అజయ్ విలన్ గా ఉన్నారనే సెంటిమెంట్ ని తీసుకున్నారు కొందరు.ఇలా వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే కచ్చితంగా ఆ సినిమా హిట్టు అని అంటున్నారు.

ఈ సెంటిమెంట్ ను భలే క్యాచ్ చేశారు అని నెటిజన్లు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube