నెటిజన్స్‌ ట్రోల్స్‌.. కాజల్‌ కు అంకుల్‌ లా ఉన్నాడు

సౌత్‌ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌.ఇప్పటికి కూడా ఈ అమ్మడు స్టార్ హీరోలకు వాంటెడ్‌ గానే ఉంది.

 Kajal And Gautham Honeymoon Pics Goes Viral ,goutham Kitchlu ,kajal,kajal Goutha-TeluguStop.com

తమిళంలో కమల్‌తో తెలుగులో చిరంజీవితో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడి క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌.

ఈ అమ్మడు గత నెల 30వ తారీకున ముంబయి బేస్డ్‌ వ్యాపార వేత్త అయిన గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.ఆమె వివాహం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా కేవలం వంద మంది సమక్షంలోనే జరిగింది.

పెళ్లి అయిన వారం లోపే వీరిద్దరు కలిసి మాల్దీవ్‌ లకు హనీమూన్‌ కోసం వెళ్లారు.అక్కడ వీరిద్దరు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ టైమ్‌ ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా వారు షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలను చూస్తుంటే అనిపిస్తుంది.

తాజాగా కాజల్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

పెళ్లి వేడుకలో కాజల్‌ కు గౌతమ్‌ సరి జోడిగానే అనిపించింది.

కాని ఇప్పుడు మాత్రం ఆయన నిజంగా కాజల్‌ కు అంకుల్‌ మాదిరిగా ఉన్నాడు అంటూ ట్రోల్స్‌ వస్తున్నాయి.కాజల్‌ వయసు తక్కువేం కాదు.అయినా కూడా ఆమె చాలా ముద్దుగా క్యూట్‌గా ఉండగా గౌతమ్‌ లుక్‌ అంకుల్‌ మాదిరిగా ఉండటంతో నెటిజన్స్‌ పెదవి విరుస్తున్నారు.ఇలాంటి వ్యక్తిని ప్రేమించడం ఏంటి కాజల్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి వ్యక్తినా నువ్వు పదేళ్లు ప్రేమించింది అంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు.మొత్తానికి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

View this post on Instagram

💙🤍

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube