ఇంకా హనీమూన్ హ్యాంగోవర్ లోనే ఉన్నకాజల్ అగర్వాల్

టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.తన స్నేహితుడు, ప్రియుడు అయిన గౌతమ్ కిచ్లూని పెళ్ళాడి భార్య హోదాలోకి వచ్చేసింది.

 Kajal Aggarwal Wears A Bikini And Eats Dinner, Tollywood, Telugu Cinema, South-TeluguStop.com

మరో వైపు సినిమా కెరియర్ 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత భర్తతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లి అక్కడ కొద్ది రోజులు జాలీగా గడిపి ఈ అమ్మడు ఇండియాలో అడుగుపెట్టింది.

ఇక్కడికి వచ్చాక ఇక కొత్త జంట కుటుంబం, ఇల్లు హడావిడిలో పడ్డారు.కొత్త ఇంటిలోకి గృహప్రవేశం కూడా చేసేశారు.

అయితే ఈ అమ్మడు మాల్దీవులు హనీమూన్ హ్యాంగోవర్ నుంచి ఇంకా పూర్తిగా బయటకి రాలేదని ఆమె పెడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.ఇప్పటికే ఆచార్య షూటింగ్ ప్రారంభమైంది.

అయినా కూడా షూటింగ్ లో జాయిన్ కాలేదు.డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ లో జాయిన్ కావాలని అనుకుంటుంది.

అయితే ఈ లోపు దొరికిన సమయాన్ని కుటుంబం, భర్తతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది.గౌతమ్ తో తన హనీమూన్ ట్రిప్ ఎంత అద్భుతంగా నడిచిందో చెప్పడానికి డైలీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ వాటి విశేషాలు పంచుకుంటుంది.మాల్దీవులు లో స్పెండ్ చేసిన సమయం, అనుభవాలు అభిమానులకి చేరవేస్తుంది.తాజాగా సముద్రం పక్కన స్విమ్మింగ్ పూల్ లో బికినీలో డిన్నర్ చేస్తూ ఉన్న ఫోటోని ఈ అమ్మడు షేర్ చేసింది.

ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇంకా కాజల్ అగర్వాల్ ఆ హ్యాంగోవర్ నుంచి బయటకి రాలేకపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube