కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోయిన కాజల్ అగర్వాల్.. వైరల్ వీడియో?

అమ్మతనం అనేది చాలా గొప్పది.ఏ అమ్మ అయినా సరే తన బిడ్డ ఎదుగుతుంటే మురిసిపోతుంది.

 Kajal Aggarwal Was Surprised By What His Son Did Viral Video Details, Kajal Agga-TeluguStop.com

ఆ బిడ్డ ఏ గొప్ప పని చేసిన పదిమందికి చెప్పుకుంటూ గర్వంగా ఫీల్ అవుతుంది.అలా తాజాగా కాజల్ కూడా తన కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోతూ దానిని పదిమందికి తెలిసేలా చేసింది.

ఇంతకు కాజల్ కొడుకు ఏం చేశాడో ఒకసారి తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ ఎంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో చూసాం.

తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకొని రాష్ట్రాల ప్రేక్షకులను అభిమానులుగా మార్చకుంది కాజల్.నటన పరంగా మాత్రం మంచి మార్కులు సొంతం చేసుకొని స్టార్ హీరోల సరసన కూడా నటించింది.

మొదటి నుండి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా మంచి సక్సెస్ లో అందుకుంది కాజల్ అగర్వాల్.అలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.ఇప్పటివరకు కాజల్ ఎటువంటి నెగటివ్ పేరు తెచ్చుకోలేదు.

కాజల్ తన జీవితాన్ని కేవలం సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా అంకితం చేసింది.తను మంచి హోదాలో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని మంచి కోడలుగా అడుగుపెట్టింది.ఇక తన ప్రేమ విషయాన్ని ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు కాజల్.

పెళ్లి చేసుకునే వరకు రహస్యంగా ఉంచి అందరికీ షాక్ ఇచ్చింది.

పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్ట్ తో పలు సినిమాలల్లో చేసింది.

ఇక అందరిలాగా కాకుండా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అందరి దృష్టిలో మంచితనాన్ని సంపాదించుకుంది.ఇక తన నటన కెరీర్ ని కూడా వదలకుండా మళ్లీ రీఎంట్రీ తో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

అలా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.వ్యక్తిగతంగా మంచి భార్యగా, మంచి తల్లిగా కూడా బాధ్యతలు చేపడుతుంది కాజల్.

ఇక సోషల్ మీడియాలో చూస్తే తన లైఫ్ ఏంటో అర్థం అవుతుంది.ప్రతిరోజు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కనిపిస్తుంది కాజల్. తన భర్తతో దిగిన ఫోటోలను, తన బాబుతో దిగిన ఫోటోలను పంచుకుంటూ అందరి దృష్టిలో పడుతుంది.తన కొడుకు ఎదగటంతో ఆడుకునే వీడియోలను బాగా పంచుకుంటుంది.

ఆ వీడియోలను చూస్తూ బాగా మురిసిపోతూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన కొడుకు సంబంధించిన ఒక వీడియో షేర్ చేసుకుంది.

అందులో తన కొడుకు వర్కౌట్ మాదిరిగా ఒక స్టిల్ ఇవ్వటంతో అది చూసి వెంటనే ఆ వీడియోని షేర్ చేసుకుంది కాజల్.తన కొడుకు చేసింది చూసి వండర్ అంటూ మురిసిపోయింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆ వీడియో చూసిన కాజల్ అభిమానులు తెగ లైక్స్ కొడుతున్నారు.అంతేకాకుండా కాజల్ మాదిరిగా కొడుకు కూడా తయారవుతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube