తెలిసి మరీ ఫ్లాప్‌ను అంటించుకుంటోన్న కాజల్  

Kajal Aggarwal Teja Gopichand - Telugu Gopichand, Kajal Aggarwal, Teja, Tollywood News

అందాల భామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది.ఆమె అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

 Kajal Aggarwal Teja Gopichand

ఇక కాజల్ సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఒకటుంటుంది అనే స్థాయిలో ఆమె ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.కానీ ఆమె కెరీర్‌లో ఎన్ని విజయాలు ఉన్నాయో అంతే పరాజయాలు కూడా ఉన్నాయి.

కాజల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజతో కలిసి నేనే రాజు నేనే మంత్రి, సీత బ్యాక్‌టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తెలిసి మరీ ఫ్లాప్‌ను అంటించుకుంటోన్న కాజల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఇప్పుడు మరోసారి తేజ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం మ్యాచో మ్యాన్ గోపీచంద్‌తో కలిసి తేజ ఓ సినిమా చేసందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకోవడానికి తేజ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ మేరకు ఆమెకు కథను కూడా వినిపించాడు ఈ డైరెక్టర్.అయితే కాజల్ ఈ సినిమాలో నటించే విషయంపై ఇంకా తన నిర్ణయాన్ని తెలుపలేదు.

కాగా ఆమె ఈ సినిమాలో నటించడం సరికాదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

హీరోగా గోపీచంద్ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడని, ఇలాంటి సమయంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తే కాజల్ క్రేజ్ తగ్గుతుందని ఆమె ఫ్యాన్స్ వాపోతున్నారు.

కానీ తేజను తన గురువుగా భావించే కాజల్‌కు ఆయనపై పూర్తి నమ్మకం ఉందని, అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఓకే అంటోందని ఆమె సన్నిహితులు అంటున్నారు.ఏదేమైనా తెలిసి తెలిసి ఓ ఫ్లాప్ మూవీని కాజల్ ఓకే చేస్తోందని ఆమెపై మండిపడుతున్నారు సినీ ప్రేమికులు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Aggarwal Teja Gopichand Related Telugu News,Photos/Pics,Images..

footer-test