శ్రీయ లాగే ప్రేమించిన వాడిని రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న టాప్ హీరోయిన్.! ఇంతకీ ఆమె ఎవరు?

మనం తెలుగు వాళ్ళం.సినిమాలు మన లైఫ్ లో ఒక భాగం అంటే అతిశయోక్తి కాదు.

 Kajal Aggarwal Talks About Her Lovemarriage-TeluguStop.com

వినోదానికి మనం అంత ప్రాధాన్యత ఇస్తుంటాము.ప్రస్తుతం మన తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే.? అధిక శాతం మందికి గుర్తొచ్చే హీరోయిన్ కాజల్.పది సంవత్సరాల నుండి తెలుగులో సక్సెఫుల్ కెరీర్ తో దూసుకుపోతుంది ఈ సుందరి.

అయితే దక్షిణాదిలో అగ్రనాయకిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీకిప్పుడు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి.ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌అగర్వాల్‌కు ఇప్పుడు ప్యారీస్‌ ప్యారీస్‌ చిత్రం మాత్రమే చేతిలో ఉంది.

టాలీవుడ్‌లోనూ ప్రముఖ హీరోల చిత్రాలేవీ లేవు.

కాజల్‌ ఇప్పుడు యువ హీరోలతో నటించడానికే ఆసక్తి చూపుతుదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.ఇప్పటి వరకూ స్టార్‌ హీరోలతో జత కట్టిన మీరు ఇప్పుడు కుర్ర హీరోలతో నటించడానికి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు ఏం చెప్పిందో చూద్దాం.నేను యువ హీరోలతో నటించడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ, నిజానికి నేనెప్పుడూ నాతో జత కట్టే హీరో ఎవరన్న విషయం గురించి పట్టించుకోలేదు.

నాకు ఇచ్చిన పాత్ర ఎలాంటిదన్న దానిపైనే దృష్టి సారిస్తాను.హీరోలెవరైనా నటించవచ్చు.అయితే నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి.ఆ పాత్రను నేను బాగా చేయాలి అనే కోరుకుంటాను.

మీ పెళ్లి ఎప్పుడమ్మా అని అడిగితే ప్రస్తుతం నేను చిత్రాలతో బిజీగా ఉన్నానని, పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదని చెబుతోంది.అయితే ఈ బ్యూటీకి ఒక ప్రేమికుడు ఉన్నాడని, ఏదో ఒక రోజున సడన్‌గా పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది.

నటి శ్రియ మాదిరిగా చడీ చప్పుడు లేకుండా పెళ్లి ముచ్చట ముగించుకుని తీరిగ్గా వెల్లడించే అవకాశం లేకపోలేదనే వారూ లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube