కాజల్ పెళ్లికి బెల్లంకొండ బాబుకి స్పెషల్ ఇన్విటేషన్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు త్వరలో తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

 Kajal Aggarwal Special Invitation To Bellamkonda Srinivas, Tollywood, Telugu Cin-TeluguStop.com

నవంబర్ ఆఖరున ఆమె పెళ్లి ఖరారు అయ్యింది.ఈ విషయాన్ని కూడా ఇప్పటికే కాజల్ క్లారిటీ ఇవ్వడంతో పాటు తనకి కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

కాజల్ అగర్వాల్ ని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలియడంతో అతని ప్రియుడు గౌతమ్ కిచ్లూ కూడా ఒక్కసారిగా పెద్ద సెలబ్రెటీ అయిపోయాడు.ఇది వరకు అతను ఒక వ్యాపారవేత్తగా అందరికి సుపరిచితం అయిన కాజల్ అగర్వాల్ భర్త కాబోతున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు.

ఇదిలా ఉంటే కాజల్ పెళ్లి వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరగబోతుంది.
ఇక్కడ విశేషం అంటే ఈ పెళ్లి వేడుకకి టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి మాత్రమే స్పెషల్ ఇన్విటేషన్ రావడం.

దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న కూడా రీసెంట్ గా రెండు సినిమాలు చేసి స్నేహితుడుగా మారిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ ని ఆమె ప్రత్యేకంగా పెళ్ళికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది.ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే వారు మంచి స్నేహితులు అని కొన్ని సందర్భాలలో తెలియజేశారు.ఇప్పుడు తన పెళ్లికి బెల్లంకొండ శ్రీనివాస్ ని పిలవడం ద్వారా అతను తనకి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అనేది కాజల్ చెప్పినట్లు అయ్యిందని టాక్ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube