పెళ్లిలో భర్తకి అలా సైగ చేసిన కాజల్ ఫోటో నెట్టింట వైరల్!- Kajal Aggarwal Share Unseen Pictures Of Her Life

Kajal Aggarwal, Kajal Aggarwal unseen picture of her marriage, pictures ,marriage, social media, gowtham kitchlu - Telugu Gowtham Kitchlu, Kajal Aggarwal, Kajal Aggarwal Marriage, Marriage, Pictures, Social Media

2007 సంవత్సరంలో లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చందమామ తన నటన ద్వారా ఎన్నో విజయాలను అందుకుంటూ ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం ,బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి పేరును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గత సంవత్సరం అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Kajal Aggarwal Share Unseen Pictures Of Her Life-TeluguStop.com

అయితే తన పెళ్లి అనంతరం చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా తన అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందిస్తూ సమాధానాలను తెలియజేశారు.

కాజల్ పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే.

 Kajal Aggarwal Share Unseen Pictures Of Her Life-పెళ్లిలో భర్తకి అలా సైగ చేసిన కాజల్ ఫోటో నెట్టింట వైరల్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా మరో వైపు సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు సినిమాలు మానేస్తారా అని అడగగా.

అందుకు కాజల్ అగర్వాల్ లేదు అనే సమాధానాన్ని చెప్పారు.సినిమాల్లో నటించేటప్పుడు మీకు బాగా సంతృప్తినిచ్చే విషయమేమిటనీ అడగగా.

కెమెరా ముందు తాను నటించిన సన్నివేశం తర్వాత కెమెరాలో చూసుకుంటూ ఆనంద పడతానని తెలిపారు.

అంతే కాకుండా మరికొంత మంది నెటిజన్లు ఇప్పటివరకు అభిమానులతో పంచుకొని పెళ్లి ఫోటో ఏమైనా ఉందా ? అనగా.కాజల్ పెళ్లి లో తన భర్త వైపు అలా చూస్తూ ఆల్ ద బెస్ట్ చెబుతున్నటువంటి ఫోటో ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు.ఇంతవరకు తన పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోను కాజల్అగర్వాల్ షేర్ చేయలేదు.

తాజాగా ఈ ఫోటోను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

#Kajal Aggarwal #Gowtham Kitchlu #KajalAggarwal #Pictures #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు