కమల్‌ను వదిలే ప్రసక్తే లేదంటున్న కాజల్‌  

Kajal Aggarwal Say She Is In Indian 2 Movie-

కాజల్‌ కెరీర్‌ చివరి దశలో ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ దశలో కాజల్‌ తాను వరుసగా సినిమాలు చేయాలనే ప్రయత్నాలు చేస్తుంది.వచ్చిన ప్రతి అవకాశంను వినియోగించుకోవాలని ప్రయత్నిస్తుంది.అలాంటి ఈ సమయంలో ముద్దుగుమ్మకు ఇండియన్‌ 2 వంటి భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా కమల్‌కు జోడీగా నటించే అవకాశం వస్తే వదులుకుంటుందా చెప్పండి.

కాని గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వదులుకుంటుందనే వస్తున్నాయి.సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా ఇతర సినిమాలు ఒప్పుకోలేక పోతున్నా అంటూ ఇండియన్‌ సినిమా నుండి ఈమె వైదొలిగినట్లుగా వార్తలు వచ్చాయి.

Kajal Aggarwal Say She Is In Indian 2 Movie- Telugu Tollywood Movie Cinema Film Latest News Kajal Aggarwal Say She Is In Indian 2 Movie--Kajal Aggarwal Say She Is In Indian 2 Movie-

Kajal Aggarwal Say She Is In Indian 2 Movie- Telugu Tollywood Movie Cinema Film Latest News Kajal Aggarwal Say She Is In Indian 2 Movie--Kajal Aggarwal Say She Is In Indian 2 Movie-

తాజాగా ఈ విషయమై మీడియాతో మాట్లాడిన ఆమె ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది.

అసలు ఇండియన్‌ 2 సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలు ఏమాత్రం కరెక్ట్‌ కాదని, తాను శంకర్‌ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.కమల్‌ హాసన్‌ గారి సరసన నటించే అవకాశం వస్తే వదులుకునేందుకు నేనేం అంత తెలివి తక్కువదాన్ని కాదు అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.షూటింగ్‌ త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చింది.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ చిత్రంకు సీక్వెల్‌గా ఇది తెరకెక్కబోతుంది.ఇప్పటికే శంకర్‌ కొంత భాగంను చిత్రీకరించాడు.లైకా ప్రొడక్షన్స్‌ వారు ఈ చిత్రంను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.2021 మార్చి నెలలో ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యింది.త్వరలోనే సినిమా మళ్లీ సెట్స్‌పైకి వెళ్లబోతుంది.కొత్త నటీనటులు కావాలంటూ ఇటీవలే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.దానికి విపరీతమైన స్పందన వచ్చింది.