అసలు సీతగా మారుతున్న మోడ్రన్ సీత

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు ఎలాంటి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆమె నటించిన సినిమాలకు తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

 Kajal Aggarwal Ready To Play Sita-TeluguStop.com

ఇటీవల కాలంలో ఆమె చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.అయితే దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘సీత’ చిత్రంలో కాజల్ పాప చేసిన పాత్ర సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కాజల్‌కు ఫుల్ మార్కులు పడ్డాయి.

కాగా ప్రముక రచయిత్రి చిత్ర బెనర్జీ రచించిన నవల ఆధారంగా ఓ సినిమా చేస్తే బాగుంటుందని, అందులో సీత పాత్ర కాజల్ చేస్తే బాగుంటుందని ఆమె కోరడంతో, కాజల్ వెంటనే ఓకే అనేసింది.

రామాయణం ఆధారంగా రచించిన నవలలో సీత పాత్రకు కాజల్ తప్ప మరెవరు న్యాయం చేయలేరని ఆ రచయిత్రీ అభిప్రాయం వ్యక్తం చేసింది.దీంతో సీత పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే తేజ తెరకెక్కించిన సీత చిత్రంలో నటించానంటూ కాజల్ చెప్పినట్లు తెలుస్తోంది.

మరి ఈ మోడ్రన్ సీత నిజమైన సీత పాత్రలో ఎలాంటి హావభావాలు చూపిస్తుందో అంటూ ఆమె ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.ఏదేమైనా కాజల్ పాప సీత పాత్రల ఎలా పోషిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ చందమామ మంచు విష్ణు సరసన ‘మోసగాళ్ళు’లో నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube