నాని ప్రొడక్షన్స్ లో మరోసారి కాజల్ అగర్వాల్ సందడి

నేచురల్ స్టార్ నాని హీరోగా స్టార్ ఇమేజ్ తో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ తో ఏకంగా పాన్ ఇండియాపై టార్గెట్ పెట్టాడు.

 Kajal Aggarwal Once Again Work In Nani Production, Tollywood, Meet Cute Movie, D-TeluguStop.com

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే ఓ వైపు హీరోగా చేస్తూనే నాని తన టేస్ట్ కి తగ్గ కథలతో నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఆ!, హిట్ మూవీలని నిర్మించాడు.ప్రస్తుతం హిట్ సీక్వెల్ నిర్మాణ దశలో ఉంది.

ఇది ఇకా స్టార్ట్ కాకుండానే ప్రొడక్షన్ నెంబర్ 4గా మరో సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశాడు.ఈ సినిమాతో నాని తన అక్క దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

మీట్ క్యూట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఫిమేల్ మల్టీ స్టారర్ మూవీగా ఈ మూవీ తెరకెక్కబోతుంది.

మొత్తం ఈ మూవీలో ఐదురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది.ఇక ఈ మూవీ కోసం నాని మరోసారి కాజల్ అగర్వాల్ ని సంప్రదించి కథ కూడా చెప్పాడని, ఆమె కూడా చేయడానికి ఒకే చెప్పిందని తెలుస్తుంది.

నాని నిర్మించిన మొదటి చిత్రం ఆ!లో కూడా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో కనిపించింది.ఇప్పుడు మరోసారి మీట్ క్యూట్ కోసం నాని నిర్మాణంలో వర్క్ చేయడానికి కాజల్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

Telugu Awe, Depthi Ganta, Kajal Aggarwal, Meet Cute, Nani, Tollywood-Movie

అలాగే తనతో మూడు సినిమాలు చేసిన నివేథా థామస్ ని కూడా ఈ సినిమాలో మరో పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.కథ నచ్చడంతో నివేథా థామస్ కూడా వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ఇక మిగిలిన ముగ్గురు హీరోయిన్స్ లలో ఇద్దరు కొత్తవాళ్లని ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube