యంగ్‌ హీరో భారీ చిత్రంకు ఓకే చెప్పిన కాజల్‌  

Kajal Aggarwal, Nithin, Power Peta, Krishna Chaitanya, Three Getups,Kajal with Nithin - Telugu Kajal Aggarwal, Kajal With Nithin, Krishna Chaitanya, Nithin, Power Peta, Three Getups

యంగ్‌ హీరో నితిన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పవర్‌ పేట.ఈ చిత్రంలో నితిన్‌ మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నాడు.18 ఏళ్ల కుర్రాడిగా 30 ఏళ్ల మద్యవయస్కుడిగా 60 ఏళ్ల వృద్దుడి పాత్రలో నితిన్‌ కనిపించబోతున్నాడు.కృష చైతన్య దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంను స్వయంగా నితిన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు.

 Kajal Aggarwal Nithin Power Peta

ప్రస్తుతం నితిన్‌ చేస్తున్న సినిమాలు అన్ని కూడా పూర్తి అయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పవర్‌ పేటను ప్రారంభించబోతున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో నితిన్‌కు జోడీగా నటించబోతున్న హీరోయిన్‌ ఎవరు అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది.

యంగ్‌ హీరో భారీ చిత్రంకు ఓకే చెప్పిన కాజల్‌-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో పవర్‌ పేట చిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా నటింపజేసే అవకాశం ఉందని అంటన్నారు. కాజల్‌ ఈమద్య సినిమాలు లేకపోవడంతో కాస్త ఢీలా పడ్డట్లుగా అనిపిస్తుంది.

ఈ సమయంలో పవర్‌ పేట చిత్రంలో ఛాన్స్‌ రావడం అంటే ఖచ్చితంగా ఆమెకు ఇది లక్కీ ఛాన్స్‌ గా ఆమె ఫ్యాన్స్‌ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పవర్‌ పేట చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉండటంతో పాటు వయసుల వేరియేషన్స్‌ చూపించాల్సి ఉంటుంది.అందుకే కాజల్‌ను తీసుకున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం కాజల్‌ ఇండియన్‌ 2 చిత్రంతో పాటు ఆచార్య చిత్రాన్ని కూడా చేస్తోంది.ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

పవర్‌ పేట మాత్రం కాస్త సమయం పట్టవచ్చు.

#Power Peta #Three Getups #Nithin #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Aggarwal Nithin Power Peta Related Telugu News,Photos/Pics,Images..