పాపం కాజల్‌ : అప్పుడు రెండు కోట్లు, ఇప్పుడు 35 లక్షలు  

Kajal Aggarwal Latest Remuneration-కాజల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ తెలుగు వారిని దాదాపు పదేళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా అలరించిన విషయం తెల్సిందే.ఈ అమ్మడు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా తన సత్తా చాటింది.

Kajal Aggarwal Latest Remuneration-కాజల్‌-Kajal Aggarwal Latest Remuneration-కాజల్‌

తెలుగు మరియు తమిళంలో దాదాపు యంగ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోలందరితో కూడా నటించేసిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒక చిత్రంలో నటిస్తోంది.గతంలోనే కాజల్‌ ఒక బాలీవుడ్‌ చిత్రాన్ని చేసింది.అయితే ఆ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.మళ్లీ ఇన్నాళ్లకు బాలీవుడ్‌లో ఈమెకు ఛాన్స్‌ దక్కింది.

Kajal Aggarwal Latest Remuneration-కాజల్‌-Kajal Aggarwal Latest Remuneration-కాజల్‌

తెలుగు మరియు తమిళ పరిశ్రమలో ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు.ఇలాంటి సమయంలో లక్కీగా బాలీవుడ్‌లో ఆఫర్స్‌ వచ్చాయని అంతా భావిస్తున్నారు.అయితే బాలీవుడ్‌లో ఈమె నటిస్తున్న సినిమాకు గాను తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.

కేవలం 35 లక్షల రూపాయలకు గాను ఈమె నటిస్తోంది.రెండు నెలల పాటు డేట్లు ఇచ్చి కేవలం 35 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం హిందీలో ఈమె షూటింగ్‌లో పాల్గొంటోంది.

గతంలో ఒక తెలుగు సినిమా కోసం కాజల్‌ ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అంతటి పారితోషికం తీసుకున్న కాజల్‌ ఇప్పుడు హిందీ సినిమా కోసం కేవలం 35 లక్షలు తీసుకుని వర్క్‌ చేయడం ఆమె అభిమానులను కలచి వేస్తోంది.ఈమెకు ఆఫర్లు తగ్గడం వల్లే ప్రస్తుతం ఇలా తక్కువ పారితోషికంకు చేస్తోంది.మళ్లీ పుంజుకుని మరోసారి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే ఉబలాటంతోనే తక్కువ పారితోషికంకు సినిమాలు ఎక్కువగా ఒప్పుకుంటుంది.మరోవైపు ఈమె ఇండియన్‌ 2 చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంలో నటించేందుకు గాను కోటి రూపాయల పారితోషికంను ఈమె అందుకోబోతుంది.