ఆచార్యతో అదృష్టం కొట్టేసిన కాజల్  

Kajal Aggarwal Huge Remuneration For Acharya - Telugu Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala Siva, Remuneration

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కీలక షెడ్యూల్‌ను షూట్ చేస్తున్న చిత్ర యూనిట్ కరోనా కారణంగా షూటింగ్‌ను నిలిపివేశారు.

 Kajal Aggarwal Huge Remuneration For Acharya - Telugu Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala Siva, Remuneration-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి వైదొలిగింది.ఆ తరువాత ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై చాలా సస్పెన్స్ నడిచింది.కాగా చివరకు ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు.గతంలో చిరు సరసన కాజల్ ఖైదీ నెంబర్ 150లో నటించిన సంగతి తెలిసిందే.

ఆచార్యతో అదృష్టం కొట్టేసిన కాజల్ - Kajal Aggarwal Huge Remuneration For Acharya - Telugu Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala Siva, Remuneration-Gossips-Telugu Tollywood Photo Image

ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.దీంతో మరోసారి ఆమెను ఈ సినిమాలో తీసుకున్నారు.

కాగా ఈ సినిమా కోసం కాజల్ భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆచార్య సినిమాలో నటించేందుకు కాజల్‌కు ఏకంగా కోటిన్నర చెల్లిస్తున్నారట చిత్ర నిర్మాత.కాజల్ ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

Kajal Aggarwal Huge Remuneration For Acharya Related Telugu News,Photos/Pics,Images..