బాలీవుడ్ లో హర్రర్ చిత్రానికి ఓకే చెప్పిన కాజల్ అగర్వాల్  

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరిగులేని ఇమేజ్ సొంతం చేసుకొని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్ ఫిమేల్ స్టార్ గా కాజల్ అగర్వాల్ ఉంది.ప్రస్తుతం అమ్మడు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఆచార్య సినిమాలో నటిస్తుంది.

TeluguStop.com - Kajal Aggarwal Green Signal To Horror Movie

ఇదిలా ఉంటే లాక్ డౌన్ కాలంలో నెల రోజుల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొని వెంటనే మాల్దీవులుకి హనీమూన్ చెక్కేసి జాలీగా గడిపిన ఈ అందాల భామ మరల సినిమా షూటింగ్ కి సిద్ధం అవుతుంది.జనవరి నుంచి ఆచార్య రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటా అని క్లారిటీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TeluguStop.com - బాలీవుడ్ లో హర్రర్ చిత్రానికి ఓకే చెప్పిన కాజల్ అగర్వాల్-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పటికే బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్న ఈ అందాల భామ తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే నిడుమోరు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పింది.బాలీవుడ్ లో ఆమె మెయిన్ లీడ్ లో ఒక హారర్‌ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగిపోయిందని వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.

స్టార్ హీరోయిన్స్ హర్రర్ కథలకి అంతగా ప్రాధాన్యత ఇవ్వరు.అయితే తమన్నా హర్రర్ జోనర్ లో హిట్ కొట్టడంతో ఆమెని స్పూర్తిగా తీసుకొని ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కే హర్రర్ స్టొరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు బిటౌన్ లో వినిపిస్తున్న మాట.

#Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Aggarwal Green Signal To Horror Movie Related Telugu News,Photos/Pics,Images..