రాజమౌళికి సిగ్నల్స్ ఇస్తున్న బ్యూటీ

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో యమ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తనదైన మార్క్ వేయాలని చూస్తున్నాడు రాజమౌళి.

 Kajal Aggarwal Giving Signals To Rajamouli-TeluguStop.com

అయితే ఆయనతో సినిమా చేసేందుకు ఓ స్టార్ హీరోయిన్ తహతహలాడుతోంది.టాలీవుడ్‌లో పదేళ్లకు పైగా తిరుగులేని హీరోయిన్‌గా తన సత్తా చాటుకున్న స్టార్ బ్యూటీ కాజల్, ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో మగధీర వంటి బ్లాక్‌బస్టర్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు భారతీయుడు 2 సినిమా తప్ప కాజల్ చేతిలో చెప్పుకోతగ్గ సినిమాలు లేవు.

దీంతో రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తే తనకు మళ్లీ అవకాశాలు వస్తాయని అంటోంది ఈ బ్యూటీ.

Telugu Kajal Aggarwal, Magadheera, Rajamouli, Telugu-

అందుకే రాజమౌళి భార్య రమా రాజమౌళికి చాలా క్లోజ్‌గా ఉంటోందట కాజల్.ఆమె ద్వారా రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు రాజమౌళికి సంకేతాలు పంపుతోంది చందమామ బ్యూటీ.మరి ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి కాజల్ సిగ్నల్స్‌ను అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube