మోసగాళ్లు ఫస్ట్ లుక్: కన్నార్పకుండా చూస్తున్న కాజల్  

Kajal Aggarwal First Look From Mosagallu Out - Telugu First Look, Kajal Aggarwal, Manchu Vishnu, Mosagallu, Telugu Movie News

మంచు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు చాలా తక్కువ సమయంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సె్స్ కాలేకపోయాడు.

Kajal Aggarwal First Look From Mosagallu Out

దీంతో వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటూ వెళ్తున్నారు.కాగా ప్రస్తుతం మంచు విష్ణు ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను తెలుగులో మోసగాళ్లు అనే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.‘అను’ అనే పాత్రలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ సైలెంట్‌గా నిల్చుని ఆసక్తిగా చూస్తున్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ చిన్ డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టేందుకు మంచు విష్ణు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో సునీల్ శెట్టి, రుహానీ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి ఈ సినిమాలో కాజల్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఈ సినిమాను వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు

Kajal Aggarwal First Look From Mosagallu Out-kajal Aggarwal,manchu Vishnu,mosagallu,telugu Movie News Related....