కాబోయే భర్త షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫోటోపై కాజల్ కామెంట్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఇల్లాలిగా మారడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ నెల 30న ఆమె వివాహం జరగబోతుంది.

 Kajal Aggarwal Fiance Gautam Kitchlu Shares Engagement Pic, Tollywood, Bollywood-TeluguStop.com

ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లూని ఆమె పెళ్లాడబోతుంది.ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత వచ్చేసింది.

ఇదిలా ఉంటే పెళ్లి ఘడియలు దగ్గరపడుతున్న కొద్ది కాజల్ అగర్వాల్ తన కాబోయే భర్త, ప్రేమికుడు అయిన గౌతమ్ తో ఉన్న స్వీట్ మెమొరీస్ అన్ని బయటకి తీస్తుంది.వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ప్రేమ కథని చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఇక కాజల్ అగర్వాల్ ని పెళ్లాడబోతున్న గౌతమ్ కి కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నపళంగా పెరిగిపోయింది.అతను కూడా తన కాబోయే భార్యతో ఉన్న స్వీట్ మెమొరీస్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఇటీవలే తనకు కాబోయే భర్త, ఆడపడుచుతో కాజల్ తీసుకున్న ఫొటో ఒకటి వైరల్ అయింది.

ఈ సారి గౌతమ్ కిచ్లూ కాజల్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.

నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఆ ఫొటోను తన ఇంట్లో పెట్టుకుని, దానిని ఫొటో తీసి ఆయన పోస్ట్ చేశాడు.బెలూన్ డిజైనింగ్ తో ఉన్న ఆ ఫొటో చూడముచ్చటగా ఉంది.

దీనిని చూసిన కాజల్ ఒక్కసారిగా ఫిదా అయిపొయింది.వెంటనే గౌతమ్ లోని క్రియేటివిటీపై ప్రశంసలు కురిపించింది.

డిజైన్ గొప్పదనాన్ని ఈ ఫొటో ప్రతిబింబిస్తోందని, తనకు కాబోయే భర్తకి కళాత్మక హృదయం ఉందని చెప్పింది.ఈ ఫోటో బట్టి కాజల్ అగర్వాల్ గౌతమ్ లో ఉన్న క్రియేటివ్ థాట్స్ కి ఫిదా అయ్యి ప్రేమలో పడిపోయి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా గౌతమ్ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube