ఉమ టైటిల్తో కొత్త సినిమా ని అనౌన్స్ చేసిన కాజల్ అగర్వాల్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలానికి పైగా పూర్తయింది.ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా ఉంది.

 Kajal Aggarwal Confirmed To Feature In Uma, Tollywood, Bollywood, Acharya Movie,-TeluguStop.com

ఈ బ్యూటీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా ఆచార్య సినిమాలో నటిస్తుంది.అలాగే కమల్ హాసన్ కు జోడిగా ఇండియన్ 2 మూవీలో భాగమైంది.

దీంతోపాటు తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ రీసెంట్ గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మెప్పించింది.

ప్రస్తుతం పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ తో కూడా ఓ వెబ్ సిరీస్ కి కమిట్ అయినట్లు టాక్.ఇక అప్పుడప్పుడు బాలీవుడ్లో కూడా కాజల్ పాప మంచి అవకాశాన్ని సొంతం చేసుకుంటూ సూపర్ హిట్ సినిమాలను

Telugu Acharya, Bollywood, Indian, Kajal Aggarwal, Tollywood-Movie

తన ఖాతాలో వేసుకుంది.అయితే ఇప్పుడు ఏకంగా హిందీలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించడానికి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఉమ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.

తన కొత్త సినిమా గురించి కాజల్ అగర్వాల్ నేరుగా సోషల్ మీడియాలో పంచుకుంది.ఉమ చిత్రంలో నటిస్తున్నానని చెప్పడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని కాజల్ అగర్వాల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

తథాగత సింఘ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.ఫుల్ ఫన్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.

కరోనా లాక్డౌన్ నుంచి విరామం లభించి షూటింగ్ పర్మిషన్ దొరికిన వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube